Wednesday, January 22, 2025

ప్రభుత్వ పాఠశాల  విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల పరిధిలోని గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు కొందరికి పంపిణీ చేయకపోవడం వలన వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులను అడగగా మా దగ్గర ఉన్న వరకు ఇచ్చాము మిగతా విద్యార్థులకు కొంత సమయము  పట్టొచ్చు అని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో చదివించుటకు ఆర్థిక పరిస్థితులు బాగోలేక ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం నాణ్యత బాగా ఉంటుందని నమ్మకంతో విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాలలో చేర్పించామని అన్నారు. పాఠశాల ప్రారంభమై మూడు నెలల కావస్తున్న పుస్తకాలు పంపిణీ చేయడంలో అధికారులు విఫలమైనారని చదువులు కూడా అంతంత మాత్రమే ఉంటుందని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల ల పై నమ్మకం కోల్పోయి మండల విద్యాధికారి ప్రధానోపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించకపోవడం వల్ల పుస్తకాల పంపిణీ సరిగా జరగలేదని పిల్లల తల్లిదండ్రులు విలేకరుల సమక్షంలో తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular