భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
Teja news
పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క ప్రిన్సిపాల్ సెక్రటరీ సుల్తాన్య కమిషనర్ పంచాయతీరాజ్ జిల్లా కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ కొత్తగూడెం వారి ఆదేశానుసారం చంద్రుగొండ మండల పరిధిలోని రావికంపాడు గ్రామపంచాయతీలో సెక్రటరీ కిరణ్ అధ్యక్షతన గ్రామ సమావేశం ముఖ్య అతిథి సిడిపిఓ నిర్మల జ్యోతి మాట్లాడుతూఅన్ని గ్రామపంచాయతీలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని స్పెషల్ ఆఫీసర్ నిర్మల జ్యోతి అన్నారు. రావికంపాడు పంచాయతీ సెక్రెటరీ కిరణ్ కిరణ్ మాట్లాడుతూ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి రోడ్లపై ఏమైనా గుంటలో ఉన్నట్లయితే తక్షణమే పూర్తి చేయాలని సిసి రోడ్లపై చెత్తాచెదారం పశువులు కట్టివేత ఎడ్ల బండ్లు ఉన్నట్లయితే వాటిని తొలగించి సీసీ రోడ్ల ఇరువైపులా చెత్తను తీసివేయాలని డంపింగ్ షెడ్లు వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణంలో క్రీడలు నిర్వహించాలని అదే విధముగా మత్తు పదార్థాలు గుట్కాలు పాన్ పరాకులు గంజాయి మొదలగు చెడు వ్యసనాలపై అవగాహన కల్పించాలని గ్రామంలో బెల్ట్ షాపుల వలన ఇబ్బంది ఉంటే తక్షణమే తొలగించాలని అన్నారు, గ్రామం మెయిన్ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ ఏర్పాటు చేయాలని గ్రామ పెద్దలు స్పెషల్ ఆఫీసర్ ని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కుదుమూరి జనార్ధన్, బొగిన బోయిన కోటేశ్వరరావు, కుక్కల ముత్యాలరావు, గ్రామ ప్రజలు మహిళలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం
RELATED ARTICLES