Friday, January 24, 2025

ప్రజా పాలనలో ప్రసవ వేదన పడుతున్న ఏజెన్సీ గ్రామాలు

ప్రజా పాలనలో ప్రసవ వేదన పడుతున్న ఏజెన్సీ గ్రామాలు.

పురిటి నొప్పులు పడుతున్నబాధితులను జడ్డిలతోనే దావకానకు  తరలింపు.

అంబులెన్స్ వెళ్లడానికి సైతం దారిలేని ఊరు బట్టి గూడెం అవ్వడం సోచనీయం.

ప్రజా పాలనలో పడకేసిన అభివృద్ధి.

కగార్  ప్రకటించాల్సింది. అరణ్యంలో కాదు.

నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ అధికారుల మీద. అంటూ ఫైర్ అవుతున్న గిరిజనులు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం పంచాయతీ బట్టి గూడెం గ్రామంలో రోడ్లు, వాహన సదుపాయ సౌకర్యాల లేక గర్భిణీ స్త్రీలు  అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దావకానకు వెళ్లాలంటే  ఆరు కిలోమీటర్లు జెడ్డితో మోసుకొని పోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు మార్గం సరిగా లేక, వాహనాలు బట్టి గూడెం లోకి వెళ్లలేని పరిస్థితి కారణంగా  పురిటి నొప్పులతో బాధపడుతున్న  మహిళలను ఊరు ప్రజలే ఆరు కిలోమీటర్లు జడ్డితో మోసుకుంటూ దావకానకు తీసుకువెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జరిగిన పరిణామం పట్ల బట్టి గూడెం ప్రజలు  పాలకుల అలసత్వంపై  తమదైన శైలిలో విరుచుకుపడ్డారు.
కగారు పేరిట మావోయిస్టులను ఏరి వేస్తున్న ప్రభుత్వం. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న
ప్రభుత్వ ప్రజా ప్రతినిధులను, అధికారులను  ఎందుకు ఏరి వేయడం లేదు. అని ప్రశ్నలు గుప్పించారు.
ఇప్పటికి 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో  ఏజెన్సీ గ్రామాలలో ఇంకా సరైన విద్యా వైద్యం రోడ్డు సౌకర్యం  లేని పరిస్థితులను ఏంటి అని అధికారులను నిలదీశారు.
పల్లెలకు పెద్దపీట వేస్తున్నాం అని గప్పాలు పలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజా పాలన చర్ల మండలం తిప్పాపురం పంచాయతీ బట్టి గూడెం గ్రామ అభివృద్ధిని మాత్రం పక్కన పెట్టేసింది అని ప్రభుత్వంపై  విమర్శలు గుప్పించారు.ఓట్ల కోసమే గిరిజనులను వాడుకొని
గెలిచాక  ఇచ్చిన హామీలను  కుప్ప తొట్టిలో వేసి అమాయక గిరిజనులను అడవిలోనే పాతరిసిందని జరుగుతున్న పరిణామాలు కొటొచ్చినట్టు కనబడుతున్నాయి. ఇప్పటికీ  జ్వరం వస్తే ప్రదమ చికిత్స నిమిత్తం ఇంకా ఆకుపసరు మింగే పరిస్థితులు ఉన్నాయి అంటే బట్టి గూడంలో అభివృద్ధి ఏ విధంగా ఉందో ఊహించవచ్చు. పురిటి నొప్పులు వస్తే ఇద్దరు మహిళలను దావకానకు జెండిలతో మోసుకుపోయే పరిస్థితులు బట్టి గూడెంలో ఉండడం పరిపాలించే నాయకుల వైఖరి ఆ గ్రామం పై ఏ విధంగా నత్తన నడక నడుస్తుందో   అర్థం చేసుకోవచ్చు. గతంలో బీ ఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ  ఎన్ని పార్టీలు అధికారంలోకి వచ్చిన గిరిజనుల బతుకులలో రవ్వంతైన పురోగతి లేకపోవడం ప్రజా పాలన ఎలా ఉందో గిరిజనుల అవస్థలను చూస్తే ముక్కు మీద వేలు వేసుకునేలా  చేస్తున్నాయి. 108 అంబులెన్స్ వెళ్లడానికి సైతం అంబులెన్స్ పట్టే అంత రోడ్డు కూడా లేకపోవడం అభివృద్ధి పడకేసిందేమో  అన్నట్టుగా  పరిస్థితులు ఉన్నాయి.  రోడ్డు దావకాన  సౌకర్యం లేక గతంలో  కూడా పురిటి నోప్పులతో  మరణించిన వారి సంఖ్య కోకొల్లలు  అని గ్రామస్తులు వెల్లడించారు. . ఇన్ని అవస్థలు పడుతున్న ఏ ఒక్క ప్రజా ప్రతినిధులు పంచాయితీ అధికారులు రోడ్ల మరమ్మత్తులు గాని ఎడ్ల బండి తోవని సరిచేయడం గాని చేసిన దాఖలాలు లేవు అంటూ తీవ్రంగా విలపించారు.
రోగం వస్తే చాలు  మరణాలు ఎక్కడ సంభవిస్తాయో అని భయం గుప్పెట్లో బతుకుతున్నాము అని గిరిజన బిడ్డలు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కాలంలో కూడా ఆరోగ్య నిమిత్తం దావకానకు వెళ్లాలంటే జడ్డిలు వేసుకొని వెళ్లే పరిస్థితి దుర్భరమైన చర్య అంటూ ప్రభుత్వం పై పలువురు  విద్యావంతులు సైతం దుమ్మెత్తి పోస్తున్నారు.
బట్టి గూడెం వెళ్లడానికి రోడ్డు మార్గం  సరిగా లేక గిరిజన బిడ్డలు పట్టపగలే నరకాన్ని చవిచూస్తున్నారు. ఒకపక్క విపరీతమైన వానలు మరోపక్క అలసత్వం వహిస్తున్న అధికారుల నిర్లక్ష్యం, తాగునీరు సైతం పొందాలంటే గంటలు వ్యవధి పాటు వేచి చూడాల్సిన పరిస్థితిలు బట్టి గూడెం లో ఉన్నాయి  అని గిరిజన బిడ్డలు అధికారుల నిర్లక్ష్యంపై నిప్పులు కక్కుతున్నారు. వైద్యం అందక గిరిజన బిడ్డలు అడవిలో ఆకురాలినట్టుగా రాలిపోతుంటే  ప్రభుత్వ మాత్రం  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ హెల్త్ క్యాంపులు సైతం  బట్టి గూడెంలో ఏర్పాటు చేయకపోవడం  దారుణమని  ప్రభుత్వ అధికారులపై  ధ్వజమెత్తుతున్నారు. ఇదిలా ఉండగా  ఏదో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన అన్న చందంగా ప్రజా పాలనకు సాదృశ్యంగా జెండాను ఎగరవేసి అంతా సవ్యంగా జరుగుతోంది అన్నట్టుగా వారు ఇచ్చే ఎలివేషన్ సినిమాలో కూడా లేనంతగా ఉంది అంటూ పలువురు విమర్శిస్తున్నారు. గంజికి లేక ఒకడు ఏడుస్తుంటే గొర్జామ్ ఎక్కువై ఇంకొకడు ఏడ్చినట్టుగా  ప్రజాపాలన ఏజెన్సీ ప్రాంతంలో అగమ్య గోచరంగా ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అని  పలువురు ప్రభుత్వ అధికారులపై విమర్శలు గుప్పించారు. ఇకనైనా ఉన్నతాధికారులు ఆ గ్రామాల వైపు కన్నెత్తి చూసి బట్టి గుడానికి చేరువలో  హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి రోడ్డు నిర్మించే విధంగా, చర్యలు తీసుకొని  నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు పై జులుం విధిలించాలని పత్రికాముఖంగా. కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular