TEJA NEWS TV : పేరుకే వంద పడకల ఆస్పత్రి వందమంది రోగులకు చికిత్స చేసే డాక్టర్లు సిబ్బంది ఎక్కడయ్యా !!!!
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని నగర శివారులలో మాజీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోట్లతో వంద పడకల ఆసుపత్రిని వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడిన సందర్భంలో డోన్ పట్టణంలో కోట్లతో వంద పడకల ఆసుపత్రిని అత్యధిక వసతులతో నిర్మించడం జరిగిందని ఇకపై డోన్ నియోజకవర్గం లోని ప్రజలు ఇతర ప్రాంతాల ప్రజలు వైద్య పరీక్షల కోసం కర్నూలుకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇక్కడ వసతులను కల్పించడం జరిగిందని తెలిపారు.
ఆస్పత్రికి వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో వైద్యులు సిబ్బంది మందులు అందుబాటులో ఎప్పుడు వస్తాయి సారు…… రోగులు
పట్టణంలో ఈ వంద పడకల ఆసుపత్రి పూర్తిగా నిర్మించకపోగా పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లు సిబ్బందితోనే కాలం గడుపుతున్నారంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. అత్యాధునిక వసతులు ఆస్పత్రిలో కల్పించడం ఏమో గాని ఇక్కడకు వచ్చే రోగులకు వారికి సరిపడా మందులు కూడా అందుబాటులో లేకపోవడం ఇక్కడకు వచ్చే రోగులకు ఆశ్చర్యం కలిగించడం ఒక అప్పట్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు దగ్గర్లో నడుచుకుంటూ వెళ్లడానికి అందుబాటులో ఉండేదని ఇప్పుడు నిర్మించిన ఆసుపత్రి నగర శివారులో ఉండటంతో అక్కడి వెళ్లడానికి ఆటోల ద్వారా ప్రయాణించాలంటే వందల రూపాయల ఖర్చు అవుతుందని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామంటూ అసహనం వ్యక్తం చేస్తుండటం గమనర్హం ఇకనైనా పై అధికారులు తక్షణం స్పందించి అన్ని మౌలిక వసతులు ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
గతంలో పట్టణంలో ఉన్న పాత ఆస్పత్రిలో పనిచేసిన గైనకాలజిస్టులు కాన్పులలో ప్రత్యేక చొరవ తీసుకొనడం వాళ్ళన డోన్ ప్రభుత్వ ఆసుపత్రి జిల్లాలోనే ఎక్కువ కాన్పులు చేసిన ఆసుపత్రిగా ఎన్నోసార్లు పేరుగాంచిందని ఇప్పుడు
కొత్తగా ఏర్పడిన వంద పడకల ఆసుపత్రిలో కాన్పుల కేసులు తక్కువగా నమోదు అవ్వటానికి ఆస్పత్రిలో ఉన్న గైనకాలజిస్ట్ లా పనితీరే కారణం అంటూ కొందరు మేధావులు వాపోతున్నారు.ఇప్పటికైనా పై అధికారులు చొరవ తీసుకొని ప్రవేట్ ఆసుపత్రి వైపు ముగ్గు చూపుతున్న గర్భిణీ స్త్రీల మరియు వారి కుటుంబాలకు ప్రభుత్వ ఆసుపత్రి వైపు మొగ్గు చూపేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు వాపోతున్నారు.
ప్రజల యొక్క అనారోగ్యాన్ని అనువుగా తీసుకొని వేల రూపాయలు దన్నుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రి యజమాన్యాలు ఆర్ఎంపీలు!!! వీరి అక్రమ ఆగడాలకు అడ్డుకట్ట పడేది ఎన్నడో!!! ఇకనైనా మేల్కొని వైద్యశాఖ అధికార యంత్రాంగం చర్యలు తీసుకొనేనా!!!!!
ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్య ధోరణిని అందిపుచ్చుకొని పట్టణంలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు,ఆర్ఎంపీ డాక్టర్లు ప్రజల యొక్క అనారోగ్యాన్ని కాన్పుల కోసం వచ్చే గర్భిణీ స్త్రీల యొక్క అవసరాలను అలుసుగా తీసుకొని కొన్ని వేల రూపాయలను దొచుకుంటున్న జిల్లా వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా డోన్ పట్టణం వైపు చూడకపోవడం ఒక విడ్డూరంగా మారిందని ప్రజలు వాపోతున్నారు…