ఎన్టీఆర్ జిల్లా, నందిగామ పట్టణం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమానికి పూర్తి భరోసానిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతెలిపారు. కంచికచర్ల మండలం కీసర గ్రామానికి చెందిన మీసాల భాస్కరరావు కుమార్తె చిన్నారి ఉదయరాణికి రూ.5లక్షల విలువగల ఎల్.ఓ.సి (లెటర్ ఆఫ్ క్రెడిట్)ముఖ్యమంత్రి ఆర్థిక సహాయ నిధి ద్వారా మంజూరైన లెటర్ ను కాకానీ నగర్ కార్యాలయంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో వైద్యం, విద్యకు సీఎం పెద్దపీట వేస్తున్నారని, రాష్ట్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు భయపడవద్దని ప్రభుత్వం తరపున ఆర్ధిక సహాయం అందిస్తామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి : ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
RELATED ARTICLES