Tuesday, January 14, 2025

పెయ్య దూడలు మాత్రమే ఇవ్వగలిగే లింగనిర్ధారిత వీర్యము వినియోగం కొరకు ఉచిత గర్భకోశచికిత్సా శిబిరం ఏర్పాటు

శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం, పి.ఎన్. పాళ్యం గ్రామంలో ఉచిత గర్భ కోశ చికిత్సా శిబిరం  జిల్లా                   పశుగణాభివృద్ది సంస్థ వారి  ఉచిత మందుల సరఫరా తో శిబిరం ఏర్పాటు

90% కచ్చితత్వంతో పెయ్యదూడల పుట్టుకను ఉద్దేశించి లింగ నిర్ధారిత వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేయు పథకం ప్రాచుర్యనిమిత్తం, ఆ పథకానికి మంచి పశువుల ఎన్నికకు, రైతుల అవగాహన కొరకు, గ్రామంలో అన్ని పశువులను పరీక్షించుట కొరకు ఉచిత గర్భకోశ చికిత్స శిబిరము ఏర్పాటు చేయడమైనది. 1350/- విలువ గల రెండు సూదులను, 850/- సబ్సిడీ పోగా 500/- మాత్రమే చెల్లిస్తే, మొత్తంగా పెయ్యదూడలను పొందే సూదులను ప్రభుత్వం వారు సరఫరా చేస్తున్నారని తెలిపారు. పైగా, రెండు సూదులు వేసినా కట్టకపోతే 500/- రూపాయలు వాపస్ ఇవ్వడం, పొరపాటున కుర్ర దూడ పుడితే 250/- వాపస్ ఇవ్వడం, విదేశీ జాతులనే కాక స్వదేశీ జాతులైన గిర్, సాహివాల్, తార్పర్కార్  వంటి కావలసిన బ్రీడ్ లను ఎంపిక చేసుకొనే అవకాశం ఉండడం, పుట్టేది పెయ్యదూడ కనుక ఈను నప్పుడు ఆవుకు కష్టం లేకుండా ఈనడం, పుట్టే పెయ్యదూడ చూడి నిలిస్తే 20% అధిక పాలనిచే శక్తి కలిగి ఉండడం అనునవి ప్రత్యేక లాభదాయకమైన అంశమలని  డి.ఎల్.డి.ఏ., అనంతపురం జిల్లా కార్యనిర్వహణాధికారి అయిన డాక్టర్ టి.వి.సుధాకర్ గారు  తెలిపారు.
కార్యక్రమం నిర్వహిస్తున్న జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్య నిర్వహణ అధికారి, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ, భవిష్యత్తులో ఈ లింగ నిర్ధారిత వీర్యము అత్యధిక ప్రాచుర్యం పొందుతుందని, గ్రామములో అత్యధిక పాడి కొరకు పేయిదూడలు మాత్రమే పొందే ఆధునిక సాంకేతిక విప్లవముగా ఈ పథకం మారగలదని ఆశాభావం వ్యక్తపరిచారు.
అదే గ్రామములో, పశువులలో చూడి నిర్ధారణ,తిరిగి ఎదకు వస్తూ కట్టకుండా నిలిచిపోయినవి, పూర్తిగా ఎదకు రానివి లాంటి  సుమారు 45 పశువులకు గర్భకోశవ్యాధుల నిపుణుడు అయిన డాక్టర్ టి.వి. సుధాకర్ గర్భకోశ పరీక్షలు నిర్వహించారు. నట్టల నివారణ మందులు 35వాటికి తాపారు , సాధారణ కేసులు 23 చూసి వాటికి తగు వైద్యం మరియు సలహాలు, సూచనలు ఇచ్చారు.
     ముఖ్యంగా,  పాడి పశువులలో మంచి కట్టు శాతం రావటానికి ఆఖరు దశలో ఉన్నపుడు కృత్రిమ గర్భధారణ చేయిస్తే మాత్రమే చూడి నిలుస్తుందని తెలుసుకోవడం,  షుమారు 11-15 ఎద లక్షణాలు ఉన్నప్పటికీ, ,3.5 చూపినా ఆ పశువు ఎదలో ఉందని రైతు తెలుసుకోగలగడం, స్థానికంగా విరివిగా లభ్యమగుచున్న సుబాబుల్ ఆకు వాడకం, ఈనిన రెండు మూడు నెలల లోనే కృత్రిమ గర్భధారణ చేయించడం, “ఏడాదికో దూడ” లక్ష్యంగా ప్రత్యేక మైన మేపు, యాజమాన్యం పాటించడం, తద్వారా పశువు తన జీవితకాలం లో సాధ్యమైనన్ని  ఎక్కువ ఈతలు ఈనడం వలన అధిక దూడలు, అధిక పాలదిగుబడి పొంది తద్వారా అధిక రాబడి పొందడం,  ఎద సూది చేసిన తర్వాత 20 రోజుల పాటు బెల్లం నీళ్లు, టెంకాయ నీళ్లు లాంటివి త్రాగించడం, రోజుకి 100 గ్రాముల  ఎముకల పొడి తినిపించడం, మునగాకు, కరివేపాకు మేపడం లాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం లాంటి విషయాలు తెలుపుటకు రైతులకు ప్రత్యేక అవగాహనా సదస్సు పెట్టడమైనది. ముఖ్యముగా, స్థానికంగా ఉన్న ఆబోతులు లేదా గ్రామపరిసరాలలో తిరుగుతున్న నాటు ఆబోతులతో దాటించడము వలన తక్కువ ప్రత్యుత్పత్తి, పునరుత్పత్తి సామర్థ్యము, జన్యులోపములు గల దూడలు పుట్టడమే కాకుండా, గర్భము పుండుగా మారి కట్టు నిలవకపోవడం, చీము కారడం, నొప్పి కలగడం, మేపు తీసుకోలేక పాలు తగ్గడం వంటి నష్టాలు వివరించడమైనది. దానికి ప్రత్యామ్నాయమైన  కృత్రిమ గర్భధారణ లాభాలను వివరిస్తూ, లింగనిర్ధారిత వీర్యము, పిండమార్పిడి వంటి నూతన సాంకేతిక ప్రత్యుత్పత్తి విధానాలతో త్వరితంగా ఉన్నత స్థాయి పాడి జాతులను, పశువుల సంఖ్యను పెంపొందించుకొనే అవకాశములను వివరించడమైనది.
ఉన్నత ప్రత్యుత్పత్తి సామర్త్యానికి బలిష్టమైన శరీరము కలిగివుండడం, పరిసరాల పరిశుభ్రతను పాటించడం, వయసుతో పాటు మంచి బరువు ఉండటం,ఋతువుల ప్రాముఖ్యతను గుర్తించడం, ఆదర్శవంతమైన దూడలు పోషణను పాటించడం లాంటి ప్రత్యుత్పత్తి సూచికలను వివరించడమైనది. పశువులకు సరైన పోషణ కొరకు పచ్చి మేత, దాణాలతొ పాటు కొండ చిగిరాకు, మునగాకు, కరివేపాకు, మొలకెత్తిన పెసలు, ఉలవలు, సద్దలు, రాగులు మేపినట్లైతే  హార్మోన్స్ లోపం మరియు పోషకార లోపాలు లేకుండా చేసి, పశువులను త్వరగా చూలు కట్టించ వచ్చునని తెలిపారు.

గర్భకోశ వ్యాధులతో ఉన్నవాటిని, ఎద లక్షణాల పశువులను, చూడి పశువులను చూపించి తగు జాగ్రత్తలు, నివారణోపాయాలు సూచిస్తూ, డాక్టర్ టి.వి.సుధాకర్ గారు హాజరయిన 55 మంది రైతులకు , AHA లకు, పశువైద్యులకు  ప్రత్యేక శిక్షణ, మెలుకువలు తెలియచేసారు.* కార్యక్రమం లో  డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ T V సుధాకర్, జిల్లా పశుగణాభి.వృద్ది సంస్థ, అనంతపురం వారు, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అమర్, 
AHAs, GMs,తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular