Friday, January 24, 2025

పెద్దకడుబురు:సిఎం జగనన్న కు కృతజ్ఞతలు – పురుషోత్తం రెడ్డి

ఖరీఫ్ 2023 లో నష్ట పోయిన రైతన్నలను ఆదుకునేందుకుగాను తక్షణ సాయంగా పంట నష్ట పరిహారం ప్రకటించిన రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు రైతన్నల ఆత్మ బంధువు జననేత శ్రీ వై. యస్.జగన్మోహన్ రెడ్డి గారికి అది త్వరతగతిన కార్యరూపం దాల్చుటకు కృషి చేసిన మంత్రాలయం శాసనసభ్యులు శ్రీ వై. బాలానాగిరెడ్డిగారికి రైతులందరి తరపున పెద్దకడుబురు మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ శ్రీ ఆర్. పురుషోత్తం రెడ్డి గారు కృతఙ్ఞత తెలియచేశారు.

గత నెల లో ముఖ్యమంత్రి గారి ఎమ్మిగనూరు పర్యటనలో మన ఎమ్మెల్యే శ్రీ వై. బాలనాగి రెడ్డి గారు మన నియోజక వర్గంలోని కరువు పరిస్థితుల గురించి కూలంకుశంగా చర్చించి నివేదిక సమర్పించిన విషయం మరియు ముఖ్యమంత్రి గారు స్పందించినతీరును వారు గుర్తుచేశారు. రైతుల సమస్యలపై గౌరవ ఎమ్మెల్యే గారు స్పందించే తీరే ప్రత్యేకమని ఇలాంటి ఎమ్మెల్యే దొరకటం మంత్రాలయం నియోజక ప్రజల అదృష్టమని కొనియాడారు. ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం నష్టపోయిన రైతులందరికి పంటనష్ట పారహారం అందేలాచూడాలని మరియు విమర్శలకు తావుఇవ్వకుండా జాబితాను సిద్ధంచేయాలని వ్యవసాయశాఖ సిబ్బందిని కోరారు.

రైతుల బ్యాంక్ వివరాలు సేకరించుటలో గ్రామ వాలంటీర్లు పూర్తి సహకారం అందించాలని, నష్ట పోయిన రైతులు రైతు భరోసా కేంద్ర సిబ్బందిని సంప్రదించాలని కోరారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular