కర్ణాటక మద్యానికి బానిసై మతిస్థిమితం సరిగా లేక వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కర్నూలు జిల్లా కోసి మండలం దుద్ది గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే దుద్ది గ్రామానికి చెందిన 48 సంవత్సరాల వయసు గల జక్కుల నరసప్ప అనే వ్యక్తి పొలాలకు పిచికారి చేసే పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు గమనించిన స్థానికులు కుటుంబసభ్యులు పుటాహుటిన నర్సప్పను కోసిగిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్ లో బాధితుని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని అక్కడ వైద్యులు వెంటనే స్పందించి రోగికి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డట్టు తెలిపారు. కుటుంబీకులు స్థానికులు తెలిపిన వివరాల మేరకు నరసప్ప గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడేవాడని కర్ణాటక మద్యానికి అలవాటు పడిన నరసప్ప కర్ణాటక మద్యం దొరకక కొన్ని కొన్ని సార్లు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవాడని, దీనికి తోడు గత రెండు రోజుల నుంచి విపరీతమైన కడుపు నొప్పి ఉండడంతో మతిస్థిమితం సరిగా లేక పురుగుల మందు తాగి ఉంటాడని స్థానికులను మనం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతనికి భార్య నాగమ్మ నలుగురు పిల్లలు ఉన్నట్లు సమాచారం.
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
RELATED ARTICLES