ఐనవోలు మండలం నందనం రైతు సేవా సహకార సంఘంలో మంగళవారం రోజు నిర్వహించిన పాలక వర్గ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నెనీ రవీందర్ రావు
ఈ సందర్బంగా బ్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన మొబైల్ ఏటీఎం నీ నాబార్డ్ సిజిఎమ్, సుశీల చింతలతో చైర్మన్ ప్రారంభించి మొదటిసారిగా నందనం సొసైటీ కి విచ్చేసిన నాబార్డ్, సిజిఎమ్ .సుశీల చింతలని పాలకవర్గ సభ్యులు ఘన స్వాగతం పలకడం జరిగింది.
అనంతరం నిర్వహించిన సమావేశంలో సంఘo యొక్క లావాదేవీలు లోన్ రికవరి,బంగారం రుణాలు డిపాజిట్లపై మరియు ,ఎఫ్.ఎస్ సి.ఎస్ ,ఆధ్వర్యంలో నిర్మించిన ఫంక్షన్ హాల్ పనులపై చర్చించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ బ్యాంక్ సీఈఓ వజీర్ సుల్తాన్, సొసైటి సీఈఓ సంపత్,పాలక వర్గం సభ్యులు బుచ్చిరెడ్డి,పద్మ,ఎలేంద్ర,రామచంద్రయ్య, ఎశాబ్, కుమార్,సంపత్ తదితరులు పాల్గొన్నారు.
పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నేనీ
RELATED ARTICLES