TEJA NEWS TV
గవినోల్ల కృష్ణారెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
పాడే మోసిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కేశం నాగరాజ్ గౌడ్
ఆత్మకూర్ సెప్టెంబర్ 05 (తేజ న్యూస్):-దేవరకద్ర నియోజకవర్గ శాసనసభ్యులు గవినోల్ల మధుసూదన్ రెడ్డి తండ్రి గవినోల్ల కృష్ణారెడ్డి గురువారం రోజు చనిపోయారు.ఇట్టి విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు జి.చిన్నారెడ్డి,మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి,టిపిసిసి కల్లుగీత డిపార్ట్మెంట్ చైర్మన్ కేశం నాగరాజు గౌడ్ వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులను వారు ఓదార్చారు.అనంతరం అంత్యక్రియలో పాల్గొని G.కృష్ణారెడ్డి పాడెను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కేశం నాగరాజు గౌడ్ రహమతుల్లా మోశారు. అంత్యక్రియలో అంత్యక్రియలో కార్యకర్తల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు