భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మహమ్మద్ నగర్ రచ్చబండ కార్యక్రమంలో గోపాల మిత్రుల కమిటీ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ను శాలువాతో సత్కరించి అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున గోపాల మిత్రులకు కనీస వేతనం 24000 రూపాయిలు ఇవ్వాలని ప్రతినెల గౌరవ వేతనం సకాలంలో అందేలా చూడాలని శాసనసభ్యులకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా గోపాల్ మిత్ర సంఘం మాట్లాడుతూ గత 24 సంవత్సరములుగా పశువర్ధక శాఖ లో రాష్ట్రవ్యాప్తంగా 15 30 మంది గోపాల మిత్రులు పనిచేయుచు రైతులుకు అందుబాటులో ఉంటూ వారికి సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ తో పాటు ప్రధమ చికిత్స అందిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలలో పాల్గొంటూ చాలీచాలని వేతనాలతో జీవనము సాగిస్తున్నాము. మా గోడు ఆలకించి కనీస వేతనం 24000 పెంచి గోపాల మిత్రులను పశువర్ధక శాఖలో విలీనం చేయాలని ప్రభుత్వాని వేడుకుంటున్నాము.
గోపాల మిత్రులు. ఏ. శ్రీనివాసరావు, రాము, కే. ప్రసాద్, జి. సత్యనారాయణ, తాటి. వెంకటేశ్వర్లు, బి సురేష్, తదితరులు పాల్గొన్నారు.
పశువర్ధక శాఖలో గోపాల మిత్రులను విలీనం చేయాలి – ఎమ్మెల్యే జారేకు వినతి పత్రం
RELATED ARTICLES