సంగెం మండల తేజ న్యూస్ టివి ప్రతినిధి.
సంగెం మండలం పోచమ్మ తండా గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని సోమవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు.
ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారిగా గ్రామానికి వచ్చిన రేవూరి ప్రకాశ్ రెడ్డికి గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తో పాటు పంచాయతీ వార్డు సభ్యులు పుష్పగుచ్చం అందించి శాలువ కప్పి సత్కరించారు.
అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.పార్టీలకతీతంగా అందరికీ అందుబాటులో వుంటామన్నారు అలాగే గ్రామ సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చారని ప్రాధాన్యత క్రమంలో వాటిని పూర్తి చేసేందుకు తాను కృషి చేస్తానని అలాగే ప్రతి గ్రామంలో సర్పంచులకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం చాలా గ్రామాల్లో ఇప్పటికీ సర్పంచులకు బిల్లులు చెల్లించలేదని తెలిపారు , రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ప్రజలు ఎప్పుడూ మంచి కోరుకునే ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని అన్నారు. ప్రజల సహకారం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని అందుకు మీ అందరి సహకారంతో గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో తాను కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగెం మండల ఎం పి డి ఓ ,ఎం పీ పీ,మరియు మండల అధికారులు ,గ్రామ సర్పంచి, ఎంపిటిసి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు,ముఖ్య నాయకులు, పాల్గొన్నారు.
పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి ఘన స్వాగతం…నూతన గ్రామ పంచాయతీ ప్రారంభం
RELATED ARTICLES