బీబీపేట్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1న మొదలయ్యే వానాకాలం సీజన్ నుంచి రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేయడం హర్షణీయమని మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ అన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం సీజన్ నుంచి రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేయడంతో రైతులకు ఉపశమనం కలగనుందన్నారు. రాష్ట్రంలో ఏటా రెండు సీజన్లలో ప్రకృతి ప్రకోపాలు, ఆకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని గత నాలుగేళ్ల నుంచి బిఆర్ఎస్ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడంతో పంట నష్టపోయిన రైతులకు బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి రూపాయి పంట నష్టపరిహారం దక్కలేదన్నారు బీమా కంటే రైతులకు కట్టే ప్రీమియం ఎక్కువగా ఉందని చెప్పి ఈ పథక అమలును రాష్ట్రంలో నిలిపివేసిందని అప్పటి నుంచి అన్నదాత పండించిన పంటలకు ఎలాంటి బీమా పథకాలు లేకపోవడంతో పంట చేతికొచ్చే సమయంలో ఆర్థికంగా నష్టపోయారన్నారు. దీనిని నివారించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న ఖరీఫ్ సీజన్ నుంచే పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని రూ.3,000 కోట్లు సంవత్సరానికి పంటల మీద బీమా పథకం కోసం కేటాయించి రైతులు చెల్లించాల్సిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని నిర్ణయించడంతో రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందడానికి ఇదే నిదర్శనమన్నారు పంటలకు బీమా పథకాన్ని పునరుద్ధరిస్తున్నందుకు రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కి ధన్యవాదాలు తెలుపుతున్నమన్నారు
పంటలకు బీమా అన్నదాతకు కాంగ్రెస్ ధీమా – మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు నాగరాజ్ గౌడ్
RELATED ARTICLES