

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం లోని నర్సింగ్ రావ్ గ్రామంలో గురువారం ఘనంగా గణేష్ నిమజ్జన ఉత్సవాలను నిర్వహించారు.ఈ సందర్బంగా శివ పార్వతి గణేష్ మండలి అధ్వర్యంలో ప్రతిష్టించిన గణ నాధుడుకి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వినాయకుని ఊరేగిస్తూ శోభ యాత్ర తీశారు.ఈ కార్యక్రమం లో హనుమాన్లు, ప్రశాంత్, నితీష్, లింగం, రాజు, గులప్రశాంత్, సాయిరాం, సోను తదితరులు పాల్గొన్నారు.