TEJA NEWS TV
జాతీయ యువజన కాంగ్రెస్ 64వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో నర్సంపేట స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తుమ్మలపెల్లి సందీప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించిన నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేముల ఇంద్రదేవ్ ఈ సందర్బంగా వేముల ఇంద్రదేవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడ్తున్న ప్రభుత్య పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత యువజన కాంగ్రెస్ నాయకులదే అని అర్హులైన ప్రతీ కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందేలా యువజన కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని తెలుపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ జాయింట్ సెక్రెటరీ మోడెం ఎల్లాగౌడ్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొదిల్ల నరేష్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రూపిక శ్రావణ్ కుమార్, ములుకల మనీష్, నర్సంపేట పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్కే షఫిక్, దుగ్గొండి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నరికే ప్రవీణ్, అధ్యక్షులు రాజు, రంజిత్, ప్రవీణ్, బానోతు తదితరులు పాల్గొన్నారు,