TEJA NEWS TV జనగాం పోలీస్ స్టేషన్లో ఒక కేసు విషయం లో మాట్లాడటానికి వెళ్ళిన అమృత రావు మరియు కవిత న్యాయవాద దంపతుల పై పోలీసుల దాడి నీ నిరసిస్తూ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ రోజు మరియు రేపు కోర్టు విధులు బహిష్కరిస్తూ రెడ్ రిబ్బన్ తో నిరసన కార్యక్రమం తెలియ జేస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పుట్టపాక రవి తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు అంబటి శ్రీనివాస్,తండ సారంగపాణి,తొగరు నర్సింహారెడ్డి,గుళ్ళ ప్రభాకర్,మోటురి రవి,కొంగరి రాజు,బోట్ల పవన్,కంసానీ అశోక్,బొడ్డుపేల్లి అజయ్,పొనుగోటి అజయ్,దాస్యం రంగనాథ స్వామి,మాంకాలి ప్రభాకర్ తదితర న్యాయవాదులు పాల్గోని నిరసన తెలియజేశారు.