నిరుద్యోగ మహా ధర్నా ను విజయవంతం చేయాలి
బిజే వైఎం నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జి కొంకిస విగ్నేష్ గౌడ్
నర్సంపేట
ధర్నా చౌక్ హైదరాబాద్ లో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వరంగల్ జిల్లా యువ మోర్చ అధ్యక్షుడు భరత్ వీర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ధర్నా యొక్క గోడపత్రికను ఆవిష్కరించి తెలంగాణలో గత పది సంవత్సరాలుగా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల మరియు విద్యార్థుల పట్ల అలసత్వం వహించడం సరికాదని తెలియజేశారు ఆర్ గ్యారంటీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇంతవరకు నిరుద్యోగుల కోసం ఏ రోజు మాట్లాడలేదు అని ఎద్దేవా చేశారు.
తెలంగాణ నిరుద్యోగ ఆత్మ వేదన
కొట్లాడి తెచ్చిన తెలంగాణ ఏమైంది
బంగారు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు
ఉద్యమ సమయంలో అప్పటి వయసు 21 30 విద్యార్థులు ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంది
ఓయూ కేయూ లలో ఇంకా ఆత్మ వేదనతో చదులులని ఎందరు విద్యార్థులు మిగిలి ఉన్నారు
రాష్ట్రం పేరు మారింది మా తలరాత మారిందా జిల్లా పేరు మారింది విద్యార్థి జీవితం మారిందా
విద్యార్థి జీవితంలో ముఖ్యమైన పది సంవత్సరాలు ఉద్యమంలో ఉద్యోగ ప్రిపరేషన్ అవుతూ ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ బంగారు తెలంగాణలో
తెలంగాణలో మేధావులు లేరా ఉన్న నోరు మెదపట్లేదు
పేపర్ లీకేజీలది ఎవరిది బాధ్యత నష్టపోయిందెవరు మానసికంగా కుంగుబాటుకు లోనైంది ఎవరు.అని ప్రశ్నించారు.
ఈ డిమాండ్స్ ను వెంటనే నెరవేర్చాలని కోరుతూ రేపు ప్రతి ఒక్క నిరుద్యోగ మరియు చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు అందరూ ఈ యొక్క ధర్నాలో పాల్గొని ధర్నా విజయవంతం చేయాల్సిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో యువమోర్చా నర్సంపేట రూరల్ మండల అధ్యక్షులు ఆముదాల రమేష్, యువ మోర్చా ఖానాపురం మండల అధ్యక్షులు ఆకుల హేమంత్ , యువ మోర్చా దుగ్గొండి మండల అధ్యక్షులు ఈర సందీప్ యువమోర్చా, నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి భవాని శంకర్ , యువమోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు,