నందిగామ పట్టణంలోని వంగవీటి మోహన రంగా క్రికెట్ టోర్నమెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గాల క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు ముగింపు దశకు వచ్చింది. ఈ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు టీం అనాసాగరం టీం పై విజయం సాధించింది. ఈ ఫైనల్ మ్యాచ్ కు నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. విజయం సాధించిన పెనుగంచిప్రోలు టీం సభ్యులకు మొదటి బహుమతి కింద 20,116/- రూపాయలు తంబళ్లపల్లి రమాదేవి ప్రకటించి, అందజేశారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ క్రీడల వలన మనసుకి శరీరానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆరోగ్యాన్నిస్తుంది. క్రీడలు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. నా దృష్టిలో క్రీడలు అనేవి గెలుపోటములకు అతీతంగా భావించినప్పుడే క్రీడా స్ఫూర్తి మెరుగు పడుతుంది. ఓడిపోయిన వారు కూడా నిరుత్సాహ పడవలసిన అవసరం లేదు. ఈ మ్యాచ్ చివరి దశ వరకు వచ్చారంటే మీరు కూడా ఎంతో కష్టపడి ఈ స్థితికి వచ్చారు, కనుక నిరుత్సాహపడవద్దని అనసాగరం టీం సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నందిగామ పట్టణ అధ్యక్షుడు తాటిశివకృష్ణ, 20వ వార్డు కౌన్సిలర్ తాటి వెంకటకృష్ణ, నందిగామ రూరల్ మండల అధ్యక్షుడు కడుపు గంటి రామారావు, ఉపాధ్యక్షుడు తెప్పలి కోటేశ్వరరావు, సుర సత్యనారాయణ, గోపి, రామిరెడ్డి వీరబాబు జన సైనికులు తదితరులు పాల్గొనడం జరిగింది.
నందిగామ పట్టణంలోని వంగవీటి మోహన రంగా క్రికెట్ టోర్నమెంట్
RELATED ARTICLES