Monday, February 10, 2025

నందిగామ నియోజకవర్గంలో పల్లె పథాన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకురాలు తంబళ్ళపల్లి రమాదేవి

జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం  వీరులపాడు మండలం బోడవాడ ,జమ్మవరం,గోకరాజుపల్లి గ్రామాలు

నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం  జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి  పల్లె పథాన కార్యక్రమంలో భాగంగా  బోడవాడ, జమ్మవరం, గోకరాజుపల్లి గ్రామాల్లో  పర్యటించారు

జనసైనికులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. . ఈ సందర్బంగా రమాదేవి మాట్లాడుతూ  గ్రామస్తులు తమకి కనీస సౌకర్యాలు లేవంటూ రమాదేవి గారికి చెప్పుకొని వాపోయారన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి దశబ్ద కాలంగా ఎన్నో అటుపోట్లు తట్టుకొని ప్రజలకోసం నిలబడుతున్నారన్నారు.  ప్రభుత్వ స్కూల్ లో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అద్వానంగా ఉన్నదని విద్యార్థుల తమ దృష్టికి తీసుకు వచ్చారని, కోడిగుడ్డులల్లో నురగ వస్తుందని చెప్పారు. పసి పిల్లలకు ఇస్తున్న ఆహారంలో కూడా ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. సమస్యలు విన్న రమాదేవి బాధితులకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దెదింపేవరకు మా ఈ పోరాటం ఆగదు అన్నారు .  జనసేన కూటమి ప్రభుత్వాన్ని స్థాపించాలన్నారు. ఈ కార్యక్రమంలో వీరులపాడు మండల అధ్యక్షులు బేతపూడి జయరాజు, పొన్నవరం వార్డ్ మెంబెర్ పసుపులేటి శ్రీనివాసరావు,కూడుపుగంటి రామారావు, సురా సత్యన్నారాయణ, పురంశెట్టి నాగేంద్ర మరియు వివిధ గ్రామాల జనసైనికులు, జనసేన నాయకులు పాల్గొన్నారు….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular