ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ డిసి చైర్మన్ రాటకొండ మల్లిఖార్జునరావు నాలుగవ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరామర్శ
నందిగామ టౌన్: హనుమంతుపాలెం గ్రామం నందు స్థానిక పార్టీ నేతలతో కలిసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ డిసి చైర్మన్ రాటకొండ మల్లిఖార్జునరావు నాలుగవ వర్ధంతి కార్యక్రమమునకు హాజరైన శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులతో కలసి వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు