ఎన్టీఆర్ జిల్లా లో స్థానిక కాకాని వెంకటరత్నం కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని సుప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త శాసన పరిష్కర్త చరిత్రకారులు వ్యవహారిక భాషా ఉద్యమ నిర్మాత శ్రీ గిడుగు వెంకట రామమూర్తి 161 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభకు కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ చాట్ల కిషోర్ అధ్యక్షత వహించారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రాయప్ప గారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు ఆంగ్ల అధ్యాపకులు శ్రీ యు.వాసుదేవరావు వాణిజ్యశాస్త్ర శాఖాధిపతి డాక్టర్ కోండ్రు రమేష్ బాబు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు డాక్టర్ చాట్ల కిషోర్ తమ అధ్యక్ష ఉపన్యాసంలో ఇవాళ మాతృభాష మన ఉనికి చిరునామా అని అది లేని నాడు ఆ జాతికి మనుగడ లేదని తెలిపారు విద్యార్థినీ విద్యార్థులు తమ మాతృభాష ను అభ్యసించి సంస్కారవంతులుగా తయారు కావాలని పిలుపునిచ్చారు అలాగే కీలక ఉపన్యాసం చేసిన ముఖ్య అతిథి శ్రీ రాయప్ప గారు మాట్లాడుతూ భారతదేశం గర్వించదగిన భాషల్లో తెలుగు భాష ఒకటని విద్యార్థులందరూ మాతృభాషపై మమకారం పెంచుకోవాలని సూచించారు అప్పుడే ఆచారాలకు సంప్రదాయాలకు విలువ పెరుగుతుందన్నారు తద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని తెలియజేశారు విద్యార్థులు వివిధ పోటీ పరీక్షలను తమ మాతృభాషలో రాసినప్పుడు అదనంగా కొన్ని ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు ఇంకా ఈ సభలో వాణిజ్య శాఖ అధిపతి డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ వాళ్ళ అనేక ప్రాంతాల్లో తెలుగు వారు స్థిరపడ్డారని వారందరినీ ఏకం చేసేది వారి భాషేనని అన్నారు ఐఏఎస్ ఐపీఎస్ వంటి పరీక్షలలో తెలుగును ఎంచుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందన్నారు ఆంగ్ల అధ్యాపకులు శ్రీ వాసుదేవరావు మాట్లాడుతూ మాతృభాష మన జీవనాడి అని ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పాఠశాల చదువు మొత్తం తమ తమ మాతృభాషలోనే పూర్తి చేయాలన్నారు అప్పుడే విద్యార్థుల్లో సర్వతో ముఖాభివృద్ధి జరుగుతుందన్నారు ఇంకా ఈ సభలో రాజనీతి శాస్త్ర శాఖధిపతి శ్రీ వై మధుసూదన్ రావు వాణిజ్య శాస్త్ర అధ్యాపకులు శ్రీ వెంకటప్ప రెడ్డి గారు పాల్గొని విద్యార్థినీ విద్యార్థులకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు విద్యార్థినీ విద్యార్థులు కుమారి సఫియా చిరంజీవి ఉప్పర మహేష్ తెలుగు భాష గొప్పతనాన్ని వివరించి విద్యార్థులను అలరించారు. ముఖ్య అతిథి ప్రిన్సిపల్ డాక్టర్ పి రాయప్ప గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటాన్ని పూలమాలతో అలంకరించి పుష్పాంజలి ఘటించటంతో ప్రారంభమైన ఈ సభ కుమారి సఫియా వందన సమర్పణతో ముగిసింది
నందిగామలో తెలుగు భాషా దినోత్సవం
RELATED ARTICLES