Teja news tv telangana :దళితులకు కుచ్చుటోపి.
దళిత బంద్ ఇప్పిస్తా అంటూ భారీగా పైసల్ వసూల్.
లక్షలు దండుకొని వేలు చేతికిచ్చిన మండల కాంగ్రెస్ నాయకులు.
ప్రశ్నిస్తే మీ దిక్కున కాడ చెప్పుకోండి అంటూరివర్స్ అటాక్.
దళిత బంధు డబ్బులు ఇవ్వమని హై కమాండ్ ఆదేశించిన
పెడచెవిన పెట్టిన మండల క్యాడర్.
మా డబ్బులు ఇవ్వకపోతే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాo.అంటున్న దళితులు.
వారి తప్పులు వేలెత్తి చూపెట్టిన క్యూ న్యూస్, తేజ న్యూస్ విలేకరిపై తప్పుడు ఆరోపణలు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం నేలారిపేట గ్రామంలో మండల కాంగ్రెస్ నాయకులు దళిత బంద్ పేరు చెప్పి భారీ వసూళ్లకు పాల్పడిన ఘటన ప్రస్తుతం మండలంలో సంచలనం గా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.
దళిత బంద్ పేరిట దళితుల వద్ద నుండి మనిషికి రెండు లక్షల రూపాయలు వసూలు చేసి దళిత బిడ్డలకు కుచ్చు టోపీ పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వం దళితుల స్వయం ఉపాధి కోసం, ఆర్థికంగా సామాజికంగా ఎదగలని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకం మండలంలో కొంతమంది కులగజ్జి తో ఇమిడి పోయిన రాజకీయ నాయకుల చెరలో పడి అస్తవ్యస్తమయిపోయింది.
ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్న దళితుల తల రాతను మార్చే పథకాన్ని ఆశ చూపించి దళితుల అవసరాన్ని క్యాష్ చేసుకున్న పరిస్థితి నెలకొన్నాయి. దళిత బంధు కోసం తాళి పుస్తెలు సైతం అమ్మి యా వత్తును ధారపోసి రెండు లక్షల రూపాయలు పోగుచేసి మండల కాంగ్రెస్ నాయకుల చేతిలో పెడితే దళిత బంధు మాట అటు ఉంచితే వారు చెల్లించిన పైకాన్ని కూడా ఇవ్వకుండా మొండి చెయ్యి చూపెట్టడమే కాకుండా మీ దిక్కున కాడ చెప్పుకోండి అంటూ రోజు వారి ఇంటి చుట్టూ ప్రదర్శనలు చేపించుకుంన్న పరిస్థితులు ఉన్నాయంటూ బాధితులు ఆరోపించారు. ఈ విషయాన్ని అప్పటి భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే పోదేం వీరయ్య దగ్గరకు తీసుకెళ్లగా మండల కాంగ్రెస్ నాయకులు తీసుకున్న పైకానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ వివరణ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయంటూ దళిత బిడ్డలు వెల్లడించారు. ఆర్థికంగా ఎదగాల్సిన తమను నిలువుగా ముంచేశారు. అనీ బాధితులు తీవ్రంగా విలపించారు.
ఎవరు డబ్బులు వారికి ఇవ్వకపోతే మండల కాంగ్రెస్ నాయకులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా మండల కాంగ్రెస్ నాయకులు చేసే తప్పులను వేలెత్తి చూపిస్తున్న క్యూ న్యూస్, తేజ న్యూస్ విలేకరిపై అనేక తప్పుడు దుష్ ప్రచారం చేస్తూ, క్యూ న్యూస్, తేజ న్యూస్ విలేఖరులు గంజాయి అమ్మేవారిని పోలీసులు పట్టుకుంటారు,అందరినీ అనిఇన్వెస్టిగేషన్లో భాగంగా ఫోన్ కాల్ లో మాట్లాడిన సంభాషణను చెప్పిన మాటను కట్ చేసి పోలీసులు అందర్నీ పట్టుకుంటారు అనే మాటను వెలుగెత్తి చూపుతూ పోలీసులను సైతం తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల వద్ద సంక్షేమ పథకాల గురించి చెప్పవలసిన మండల కాంగ్రెస్ క్యాడర్, క్యూ న్యూస్ పాత్రికేయుడు సంస్థకు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వట్లేదు అన్నదానిపై ప్రజలతో నాయకులతో చర్చించడం ప్రస్తుతం వారు దిగజారిన బుద్ధి తేటతెల్లమయింది. ప్రజల సమస్యలను పాతరేసి చిల్లర రాజకీయానికి ఒడిగడుతున్న ఈ నాయకులను ప్రజలు పంచాయతీ ఎలక్షన్లలో గెలిపిస్తారా,? అనే అనుమానాలు లేకపోలేదు.అన్ని వర్గాలను కలుపుకుపోవాల్సిన నాయకులు కులాలను విభజన చేస్తుంటే ఇప్పుడే మండలంలో చిగురిస్తున్న కాంగ్రెస్ పార్టీ, కులగజ్జి నాయకుల నిర్ణయాలకు మండలంలో బలోపేతం అవ్వగలదా అంటూ పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో దళితులకు స్థానం లేదు అన్నట్టుగా యూత్ అధ్యక్ష పదవికి ఒక దళితుడు రావుల నాని పోటీ చేస్తే ఉన్నఫలంగా అతనిపై లేనిపోని ఆరోపణలు మోపి చివరికి ఎలక్షన్ నుంచి తొలగించే ప్రయత్నం చేసిన నేపద్యంలో మండల ప్రజానీకం సైతం వారు చేసిన పనులకు ఈసారి పంచాయతీ ఎలక్షన్లలో భారీగానే ఓటమిని అంటగట్టే పరిస్థితి కూడా లేకపోలేదు అని మండలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనాప్పటికీ ఇటువంటి కులగజ్జి తో కూడిన నాయకులను మళ్లీ ప్రజలు వచ్చే పంచాయతీ ఎలక్షన్లలో గెలిపిస్తారా అనేది ప్రశ్నార్థకమే అంటూ వారు వీరు అనుకుంటున్నారు.
దళిత బంద్ ఇప్పిస్తా అంటూ భారీగా పైసల్ వసూల్
RELATED ARTICLES