నందిగామ : నందిగామ పట్టణం ఆర్ఎస్ గార్డెన్స్ నందు ఆదివారం నాడు తెలుగుదేశం పార్టీ *ఐటీ ప్రొఫెషనల్ వింగ్* వారు నిర్వహించిన *”టౌన్ హాల్ మీటింగ్”* లో విశ్లేషకులు,విశ్రాంత ఉద్యోగులు, న్యాయవాదులు,అనేక ప్రజా సంఘాల నేతలతో కలసి సమావేశంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యురాలు *తంగిరాల సౌమ్య*..
*నందిగామ నుంచి ఎందరో మహానుభావులు పిల్లమరి వెంకటేశ్వరరావు గారు, అడుసుమళ్ళి సూర్యనారాయణ రావు గారు,అయ్యదేవర కాళేశ్వరరావు గార్లు చెప్పుకుంటూ పోతే నందిగామ నుంచి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు*
_*వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు శ్రీ సుఖశామలాంబ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం కట్టించారు. ఈ దేవాలయం పంచలింగ క్షేత్రముగా ప్రసిద్ధి చెందింది*_
*నాన్నగారి హఠాన్మరణంతో రాజకీయాలలోకి వచ్చిన నన్ను మీ సొంత ఆడపడుచులా భావించి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ప్రతి కార్యక్రమంలో నా వెంట ఉండి మీరు అందిస్తున్న సహాయ సహకారాలకు ఎల్లవేళలా మీకు శిరస్సు వంచి నా నమస్సుమాంజలి*
*వైయస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు మూతపడ్డాయి. గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకాన్ని ఐదు కోట్ల రూపాయల నిధులు వెచ్చించి నీళ్లు పారించి రైతన్న పంట పొలాలకు నీళ్లను అందించాము.*
_*ఒక్క ఛాన్స్ మాయతో అధికారం పోయిన తరువాత గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో మంజూరు కాబడిన చింతలపూడి,వెంకటమ్మ కట్టా, పోపురు స్కీమ్ II ఇలా ఎన్నో స్కీములను కేవలం కక్షపూరితనంతోనే నిలిపివేసి రైతన్నను అధికార పార్టీ నేతలు ముప్పుతిప్పలు పెట్టారు..*_
*సుబాబుల రైతన్నలు కష్టాలు వర్ణనాతీతం, పంటలకు గిట్టుబాటు ధర లేదు,రైతు సబ్సిడీలు, ఇలా ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేసిన దుర్మార్గ ప్రభుత్వం వైఎస్ఆర్సిపి*
_*రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. హోమ్ మినిస్టర్లు సాక్షాత్తు మహిళల అయిన తాడేపల్లి ప్యాలెస్ పిల్లి జగన్ రెడ్డి ఇంటికి కూత వేటు దూరంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగిన ఏ ఒక్క కేసులో కూడా పురోగతి లేదు వారి కుటుంబాలను ఆదుకున్నది లేదు*_
*ప్రభుత్వ ఉద్యోగస్తులను నట్టేట ముంచిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ వారికి డిఏలు,ఇంక్రిమెంట్లు వారికి రావలసిన లాభాలను కూడా మింగేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్ రెడ్డి*
_*యువతకి ఉపాధి లేదు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు రావు యువత మొత్తం గంజాయి మత్తులో జోగుతోంది . దేశంలో ఎక్కడ గంజాయి దొరికిన దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని చెప్పుకోవలసి రావటం మన దౌర్భాగ్యం.*_
*ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు విద్యా ప్రమాణాలు పూర్తిగా మంట కలిసిపోయాయి. విద్యార్థుల భవిష్యత్తు అఘమ్య గోచరంగా ఉంది.*
*తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుతోనే రానున్న రోజులలో ఎన్నో రకాల బ్రిడ్జిలు,రవాణా సదుపాయాలు ఎన్నో రకాల పరిశ్రమలు తప్పకుండా వస్తాయి. యువత భవితకు భరోసా అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారితోనే సాధ్యం.*
*చంద్రబాబు నాయుడు గారి పై పూర్తి విశ్వాసంతోనే ఈరోజు ఎక్కడికక్కడ వైయస్సార్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి ఈ భారీ చేరికలు*
_*ఈరోజు అనాసాగరం గ్రామం నుంచి వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసిన 40 కుటుంబాల వైయస్సార్ పార్టీ నేతలకు పేరుపేరునా నా హృదయపూర్వక అభినందనలు*_
*ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఐటీ ప్రొఫెషనల్ వింగ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, గుదే రమేష్, సతీష్, అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ ప్రజా సంఘాల నాయకులు, న్యాయవాదులు,విశ్రాంత ఉద్యోగులు, రైతులు తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు,కార్యకర్తలు,అభిమానులు, సానుభూతిపరులు ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు.*
తెలుగుదేశం జనసేన ప్రభుత్వంతోనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి సాధ్యం
RELATED ARTICLES