Friday, January 24, 2025

తెలంగాణ గర్వించే గొప్ప నేత కొండా లక్ష్మణ్ బాపూజీ

సంగెం మండలంలొ ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు  -దేశసేవకు అంకితమైన ఉద్యమాల ఊపిరి..కొండా లక్ష్మణ్‌ బాపూజీ సంగెం మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల నరహరి  అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం సహకార రంగాల పటిష్టత కోసం జీవితకాలం బాపూజీ కృషి చేశారని,బహుజన నేతగా,నేతన్నలైన పద్మశాలీలను సంఘటితం చేసిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మన్ బాపూజీ అని సంగెం మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల నరహరి అన్నారు.శుక్రవారం రోజున మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బాపూజీ 109వ జయంతి వేడుకలు అంగరంగా వైభవంగా నిర్వహించారు.అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళీర్పించారు.ఈ సందర్బంగా కందగట్ల నరహరి మాట్లాడుతూ..తొలి,మలిదశ తెలంగాణ సాధన పోరాటంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని అన్నారు.తెలంగాణా ఉద్యమ సమయంలో వారి సేవలను మననం చేసుకున్నారు.భవిష్యత్ తరాలకు ఆయన పోరాటపటమ,రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకమనీ అన్నారు.స్వాతంత్ర సమరయోధుడు,తొలి మలిదశ పోరాట యోధుడని అలుపెరుగని వీరుడని నిత్యం స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ప్రజల్లోఉండేవారని అన్నారు తెలంగాణ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి బాపూజీ మనందరికీ స్ఫూర్తి ప్రదాత అని అన్నారు.తన జీవిత కాలమంతా అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పరితపించిన గొప్ప నాయకుడు బాపూజీ అన్నారు.ఈ కార్యక్రమంలోమాజీ ఎంపీపీ కందగట్ల కళావతి,మాజీ ఎంపీటీసీ మల్లయ్య, కోడూరి సదయ్య, ఆగపాటి రాజు,అప్పల కవిత,శరత్, పద్మశాలి కమిటీ ఇప్పకాయల రమేష్, విజయ్,మనోహర్, కందగట్ల వెంకటేశ్వర్లు, సంపత్, బిట్ల రామకృష్ణ, వేణు, తిరుపతి,చిందం విరస్వామి, పేరాల లక్ష్మీనర్స్ను, కొంతం వేణు , బూర ప్రకాష్, బాల్నే శేఖరయ్య, మడత సుధాకర్, శ్రీరాముల యాకయ్య, పులిపాటి లింగమూర్తి, మధు,అందె కృష్ణ మూర్తి, కటకం భిక్షపతి, సామల శేఖర్ ఇప్పకాయల రాజ నరేందర్ ,తదితరులు పొల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular