వరదయ్యపాలెం
తిరుపతి జిల్లా,
సత్యవేడు నియోజకవర్గం,వరదయ్యపాలెం మండలం లోని కారిపాకం గ్రామంలో దేవాంగ, చేనేత నాయకులు పర్యటించి మీచౌంగ్ తుఫాన్ భాదిత చేనేతలను కలసి,వారి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు.వ్యవసాయం తరువాత అతి పెద్ద కుటీర పరిశ్రమ ఐన చేనేత ఇప్పటికే అంపశయ్యపై ఉందని,గోరుచుట్టుపై రోకటి పోటులా ఇప్పుడు తుఫాన్ ప్రభావం చూపిందని అన్నారు.జిల్లా లోని వెంకటగిరి,శ్రీకాళహస్తి,సత్యవేడు,గూడూరు,చంద్రగిరి నియోజకవర్గాలతో పాటుగా పుత్తూరు లోని చేనేత మగ్గాలపై ఉన్న నూలు,పట్టు,జరీ లాంటి ముడిసరకులు,తేమ చేత పాడయిపోయిందని,నాణ్యత కోల్పోయినదని వారు తెలిపారు.గుంతల్లో నీరు చేరడంతో కొన్ని పని ముట్లు దెబ్బతిన్నదని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం సంబందిత అధికారులచే క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి,నష్ట పోయిన చేనేతలకు తగు నష్ట పరిహారం వెంటనే ఇప్పించి చేనేతలను ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ దేవాంగ సాధికార సమితి కన్వీనర్ మరియు రాష్ట్ర దేవాంగ సంఘం కార్యవర్గ సభ్యులు శివశంకర నాప మునిరాజా,ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా కార్యదర్శి,బుద్ది విజయలక్ష్మి(సూళ్లూరుపేట),సంయుక్త కార్యదర్శి బండారు శారద,స్థానిక చేనేతలు సప్రం సుధాకర్,చలపతి,రఘునాధ్, హరికృష్ణ,బాలాజీ,పలువురు చేనేతలు,మహిళలు పాల్గొన్నారు.
తుఫాను భాధిత చేనేతలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి
RELATED ARTICLES