TEJA NEWS TV
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని గొర్రెల పెంపకం దారుల శిక్షణ కేంద్రంలో గొర్రెల పెంపకం దారుల శిక్షణ ఉపసంచాలకులుగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పి.శాంతయ్య పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆయనను డోన్ ఏరియా వెటర్నరీ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నాగరాజు ఆద్వర్యంలో శాలువాలతో పూల మాలలతో మేమంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు హరీష్ హుస్సేన్ బాషా,భాను, లైవ్ స్టాక్ అసిస్టెంట్ మహమ్మద్ రఫీ,ఆఫీస్ సబార్డినేటర్లు మహ్మద్ షేక్షావలి, మహేంద్ర బాబు,డేటా ఎంట్రీ ఆపరేటర్ నవ్య,తదితరులు పాల్గొన్నారు.
డోన్: పదవి విరమణ పొందిన గొర్రెల పెంపకం దారుల శిక్షణ ఉపసంచాలకులు డాక్టర్ పి శాంతయ్యకు సన్మానం
RELATED ARTICLES