మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో గత నాలుగు రోజుల నుండి భక్తి శ్రద్ధలతో జరుపుతున్న మహంకాళి అమ్మవారి జాతర ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం చేగుంట గ్రామానికి చెందిన డిష్ రాజు పలారం బండి రథోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ మాజీ శాసన సభ్యురాలు పద్మ దేవేందర్ రెడ్డి లు మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు డిష్ రాజు ఏర్పాటు చేసిన పలారం బండికి ప్రత్యేక పూజలు చేసి పలారం బండిని ప్రారంభ నిర్మించారు ఈ కార్యక్రమంలో డిష్ రాజు మాజీ జెడ్పిటిసి మూదం శ్రీనివాస్ మాజీ చేగుంట సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి పల్లె క్రాంతి కుమార్ సోమ సత్యనారాయణ చింతల సిద్ధి రాములు ప్రజలు భక్తులు పాల్గొన్నారు