TEJA NEWS TV
తేజ న్యూస్ టివి ప్రతినిధి.
తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ (టీపీఎ) ఆధ్వర్యంలో 2025 క్యాలెండర్, డైరీని రాష్ట్ర అధ్యక్షులు మోత్కూరి రామచంద్రరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళీధర్ రావు ఆవిష్కరించారు. ఆదివారం డెల్టా స్కూల్ కార్యాలయంలో జరిగిన వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు బొజ్జ సురేశ్ అధ్యక్షతన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మోత్కూరి రామచంద్రరావు హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సైకాలజిస్ట్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా ప్రతి ఒక శాఖలో ఒక సైకాలజిస్ట్ ఉండాలని స్కూలు కాలేజీలు ఎంతో మంది మానసికంగా బాధపడుతున్నారు,అని అన్నారు ఈ కార్యక్రమంలో సైకాలజిస్టులు శివుడు, అపర్ణ, శ్రీవిద్య, అనిల్ కుమార్, నిరజ, వెంకటేశ్వర్లు, గోవర్ధన్, శంకర్ నాయక్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.