TEJA NEWS TV
ప్రజల ఆశీర్వాదంతో గెలుపొంది మండల కేంద్రానికి విచ్చేసిన జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు ప్రజలు ఘన స్వాగతం పలికారు..
కార్యక్రమంలో ఇటీవలే మరణించిన మద్నూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భగవాన్ తమ్మేవార్ గారి ఫోటోకి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మౌనం పాటించారు..
సోదరుడు భగవాన్ గారు భౌతికంగా మన మధ్యన లేకపోయినా ఆయన మన హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారని భావోద్వేగం చెందారు..
పార్టీకి వారు చేసిన సేవలను మరువలేమని వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు..
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేశారు.
తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు పాదాభివందనాలు చేస్తున్నానన్నారు..
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంత మంది నాయకులు మనల్ని మోసం చేసి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని ప్రచారం చేసి మనకు నమ్మకద్రోహం చేశారన్నారు..
అటువంటి వాళ్ళను ఏ మాత్రం వదిలే ప్రసక్తి లేదని, వాళ్ళను గల్లా పట్టి బయటకు లాగి తగిన బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు సూచించారు..
బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారిపట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..
ఎందుకంటే కష్ట కాలంలో పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలు నాకు ముఖ్యమని..
మీకు తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు..
ఇటీవలే అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగిందని..
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను త్వరితగతిన పరిష్కారించాలని వారిని ఆదేశించడం జరిగిందన్నారు..
హన్మంత్ షిండే పదిహేనేళ్ల పాలనలో జుక్కల్ ప్రజలు పడ్డ కష్టాలు ఇక తొలగిపోయాయని..
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరికీ మంచిరోజులు రాబోతున్నాయని అన్నారు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అటు రాష్ట్రం ఇటు మన జుక్కల్ నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు..
జుక్కల్ : మద్నూర్ మండలంలో విజయోత్సవ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
RELATED ARTICLES