భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ ని అశ్వారావుపేట గెస్ట్ హౌస్‌లో బీజేపీ బీజేఎంసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు మర్యాదపూర్వకంగా కలుసుకుని శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని 14 మండలాలకు సంబంధించిన గిరిజన, బహుజనుల ప్రధాన సమస్యలపై మెమొరాండం అందజేశారు. ముఖ్యంగా:
* పక్కా ఇళ్ల నిర్మాణం
* సీసీ రోడ్ల అభివృద్ధి
*అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల ఏర్పాటు
*విద్యుత్, త్రాగునీటి సమస్యలు
పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ బీజేఎంసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలగాని శ్రీనివాసరావు గౌడ్, గాదె సత్యం, కూరం మహేంద్ర, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జటాత్ హుస్సేన్ నాయక్ ని కలిసి వినతిపత్రం సమర్పించిన మద్దిశెట్టి
RELATED ARTICLES