ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, వీరులపాడు మండలం, కొనతాలపల్లి గ్రామంలో మన జనసైనికుడు అయిన గోబీనేని నాగరాజు ఆకస్మిత మరణం చెందారు. అని తెలుసుకున్న నందిగామ జనసేన సమన్వయ కర్త తంబళ్లపల్లి రమాదేవి గారు కొనతాలపల్లి గ్రామం లోని (బీసీ కాలనీ) లో వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఈ సందర్బంగా రమాదేవి మాట్లాడుతు గోబీనేని నాగరాజు మరణ వార్త విని దిగ్భ్రాంతి కి లోనయ్యానని, గోబినేని నాగరాజు క్షేత్రస్థాయిలో జనసేన పార్టీకి చేసిన సేవలు మరువలేమని, అటువంటి వ్యక్తి కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలబడతామని, వారికి ఎటువంటి సమస్య వచ్చినా నేను ముందుండి వారికి అండగా నిలబడతాను అని వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించి, వారి కుటుంబానికి జనసేన తరఫున భరోసా కల్పించారు.అక్కడనుండి జమ్మవరం లోని మండల అధ్యక్షుడు బేతంపూడి జయరాజు గారి ఇంటిదగ్గర ఏర్పాటుచేసిన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత పొన్నవరం గ్రామంలోని జనసైనికుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని, ఆ గ్రామం పర్యటించి అక్కడి ఎవర్ని ఆ గ్రామంలో ఎవరిని అడిగిన తాగడానికి మంచి నీళ్లు కూడా సరిగా రావట్లేదని తెలుసుకున్నారు ఆ సమస్యను కూడా త్వరలో తీరుస్తానని గ్రామ ప్రజలకి మాట ఇచ్చారు, తరువాత వార్డ్ మెంబర్ ఏర్పాటు చేసిన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు బేతంపూడి జయరాజు, పసుపులేటి శ్రీను, గ్రామ అధ్యక్షులు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది.
జనసైనికుడు గోబీనేని నాగరాజు ఆకస్మిత మరణం – సానుభూతి తెలిపిన తంబళ్లపల్లి రమాదేవి
RELATED ARTICLES