భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
23-10-2024
*SC సబ్ ప్లాన్ ద్వారా 10 కోట్లు మంజూరు త్వరలో నియోజకవర్గ వ్యాప్తంగా దళిత వాడల అభివృద్ధికి వినియోగిస్తాం*
ఇంటింటికి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ ఎమ్మెల్యే జారే
మీ ఎమ్మెల్యే మీ ఇంటికి కార్యక్రమంలో భాగంగా చండ్రుగొండ మండలంలో సీతాయిగూడెం, దామరచర్ల, అయ్యన్నపాలెం, రాజీవ్ నగర్, చండ్రుగొండ, తిప్పనపల్లి, రేపల్లెవాడ, తుంగారం, పోకలగూడెం, మంగయ్యబంజర, రావికంపాడు, గ్రామాలలో అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారె ఆదినారాయణ విస్తృతంగా పర్యటించి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఆయా గ్రామాలకు వెళ్లి అందించడంతోపాటు వారి యోగక్షేమాలను తెలుసుకొన్నారు.. పలు గ్రామాలలో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారిని పరామర్శించి ఇబ్బందికర పరిస్థితులలో అండగా ఉంటానని మనోధైర్యం ఇచ్చి మెరుగైన వైద్యం అవసరం ఉన్నవారికి తన ద్వారా ఉచిత వైద్యం అందిస్తానని తన పరిధిలో ఉన్నటువంటి ఎల్ఓసిని పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అశ్వారావుపేట నియోజకవర్గంలోనే అత్యధికంగా ఉపయోగించుకోవడం జరిగిందని తద్వారా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఎందరికో ఖర్చుతో కూడుకున్న ఆపరేషన్లను ఉచితంగా చేయించానని అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరూ పార్టీలతో సంబంధం లేకుండా తనను సంప్రదించాలని ఉచితంగా వైద్యం చేయించడానికి కృషి చేస్తానని తెలిపారు..
అలాగే ఇటీవల జిల్లా దిశ కమిటీ సభ్యులుగా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామానికి చెందిన బొర్రా సురేష్ నియమితులైనందన వారి ఆహ్వానం మేరకు శ్రీ శ్రీ కళ్యాణ మండపంలో జరుగుతున్న సన్మాన కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సంధ్యారాణి, ఎంపీడీవో అశోక్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భోజ్య నాయక్, అంకిరెడ్డి కృష్ణారెడ్డి, గోవిందరెడ్డి, పజిల్ బక్షి, సయ్యద్ రసూల్, సారేపల్లి శేఖర్, మాజీ సర్పంచ్ రుక్మిణి, బడుగు శంకర్, కడియాల పుల్లయ్య, నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు..
చండ్రుగొండ :మీ ఎమ్మెల్యే మీ ఇంటికి కార్యక్రమం
RELATED ARTICLES