సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణ వనం మండలంలోని బైపాస్ రోడ్డులో కారు స్కూల్ బస్సు ఢీకొని కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళకు తీవ్ర గాయాలతో పరిస్థితి విషమంగా ఉంది.పుత్తూరు మండలం పరమేశ్వర మండలం గ్రామానికి చెందిన రమేష్(60), పుష్ప(55), భాను(42), వనజాక్షమ్మ(60), శివమ్మ(55) లు కారులో తమిళనాడులోని పెరంబురులో నిశ్చితార్థానికి వెళ్లి తిరిగి వస్తుండగా..
నారాయణ వనం బైపాస్ వద్ద ఎదురుగా శ్రీ వెంకటేశ పెరుమాళ్ కళాశాలకు చెందిన బస్సు కారును ఢీకొంది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రమేష్, పుష్ప, భాను, వనజాక్షమ్మ సంఘటన స్థలంలోనే మృతి చెందారు.
మరో మహిళ శివమ్మకు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు చికిత్స నిమిత్తం తిరుపతి రుయా కు తరలించారు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం – నలుగురు మృతి – మరో మహిళ కు తీవ్ర గాయాలు
RELATED ARTICLES