దాదాపు గత 15 ఏళ్లుగా వరదయ్యపాలెం మండల అధికారిగా సేవలoదించి ప్రజాసమస్యల పరిష్కారానికి మండల ప్రగతికి కృషి చేసి రాజకీయాలకు అతీతంగా అందరి అభిమానాన్ని చూరగొన్న సౌమ్యుడుగా ప్రజాభిమానం పొందిన ఎంపిడిఓ సుబ్రమణ్యం రాజు సేవలు చిరస్మరణీయం, అపూర్వం అభినందనీయం అని ఎంపీపీ భర్త దామోదర్ రెడ్డి, వైసీపీ కన్వీనర్ దయాకర్ రెడ్డి ఏపీ దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ తిలక్ మాజీ సర్పంచ్ చిన్నా, సింగిల్ విండో ఛైర్మెన్ హరి రెడ్డి అన్నారు.వరదయ్యపాలెం ఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఎంపిడిఓ సుబ్రమణ్యం రాజు పదవీ విరమణ ఆత్మీయ వీడ్కోలు వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు, పాత్రికేయులు ప్రజాప్రతినిధులు. ఆయా శాఖల అధికారులు సిబ్బంది సచివాలయం సిబ్బంది కార్యదర్శులు ఎంపిడిఓ ను సన్మానించి జ్ఞాపికలను బహూకరించారు.కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు సామర్ల హరి గుత్తి త్యాగరాజు, కిన్నెర ఉమామహేష్ ఎస్సీ సెల్ కన్వీనర్ బందిల సురేష్ సర్పంచులు చంద్రారెడ్డి, వేణు శ్రీధర్ రెడ్డి శ్యామల సుబ్రమణ్యం, శ్రీకాళహస్తి దేవస్థాన బోర్డ్ డైరక్టర్ పెద్దిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సుబ్రమణ్యం రెడ్డి ngo జేఏసీ కన్వీనర్ బొప్పన లలిత్, pet బందిల కుమార్, హెస్ ఎమ్ రామకృష్ణా రెడ్డి,ఎమ్ ఇ ఒ సరస్వతి యువజన అధ్యక్షుడు వినోద్, వైసీపీ నాయకులు గిరిరెడ్డి శ్రీనురెడ్డి, వైద్యాధికారి అనిత, సి డి పి ఒ,దేవకుమరి, సీనియర్ అసిస్టెంట్ మురళీ కృష్ణ పంచాయతీ కార్యదర్శిలు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు
ఘనంగా వరదయ్యపాలెం ఎంపిడిఓ సుబ్రమణ్యం రాజు పదవీ విరమణ ఆత్మీయ వీడ్కోలు వేడుకలు
RELATED ARTICLES