TEJA NEWS TV : ఘనంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలు
*తేజ న్యూస్ టివి ప్రతినిధి.*
*ఆర్థిక సరళీకృత విధానాలకు ఆద్యుడు, భారత ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించిన దార్శనికుడు, తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు
జయంతి సందర్భంగా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చిత్రపటానికి పూల మాలలు వేసి, ఘన నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ
భారత మాజీ ప్రధాని, భారత రత్న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా వారు దేశానికి అందించిన సేవలను పరకాల శాసనసభ్యులు రేవురి ప్రకాశ్ రెడ్డి స్మరించుకున్నారు
నాటి ప్రపంచ ఆర్థిక విధానాలకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక స్థితిని చక్కదిద్దిన దార్శనికుడు, భరత జాతి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని కొనియాడారు.
తెలంగాణ బిడ్డగా మనందరం గర్వపడాల్సిన పీవీ అందించిన స్ఫూర్తి మరువలేనిదని తెలిపారు.
పీవీకి 17 భాషల్లో ప్రావీణ్యం ఉన్నప్పటికీ తన మాతృభాష తెలుగు అభివృద్ధికి పీవీ ఎంతోగానో కృషి చేశారు.అని అన్నారు.