బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం. పరకాల నియోజకవర్గంలో అమరవీరులకు నివాళులర్పించిన బిజెపి నాయకులు. ఘనంగా మంగళవారం రోజు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు. తెలంగాణ విమోచన దినోత్సవం, వేడుకలు పరకాల బిజెపి పట్టణ అధ్యక్షుడు మార్త బిక్షపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర ప్రధనకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాంటెస్టెంట్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి, డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ కాచం గురుప్రసాద్ పాల్గొన్నారు* మొదటగా అమరవీరుల మైదానంలో అమరవీరులకు నివాళులర్పించి, శక్తి స్తల్ వద్ద విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం మొత్తం స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న వస్తే మనకు తెలంగాణ కు మాత్రం 1948 సెప్టెంబర్ 17న వచ్చిందన్నారు. నిజాం రజాకార్ల ఆధీనంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా స్వాతంత్ర్యం రావడం జరిగిందని రజాకారులకు ఎదురు నిలిచి పోరాడిన తెలంగాణ గడ్డ మన పరకాల పురిటి గడ్డ అని అన్నారు. రజాకార్ల ఆకృత్యాలను ఎదురొడ్డి పోరాడిన తెలుగు గడ్డ మన పరకాల అని అలాంటి పరకాలకు ఒక గుర్తింపుగా అమరవీరుల స్థూపాన్ని నిర్మించిన ఘనత మన విద్యాసాగర్ రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని పరకాలకు ప్రత్యేక హోదాను కల్పించాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు.శక్తి స్తల్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. తదనంతరం పరకాల ప్రభుత్వ సివిల్ హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేసి చేశారు. ఈకార్యక్రమంలోజిల్లా పదాధికారులు ప్రజా ప్రతినిధులు నియోజకవర్గ నాయకులు పరకాల నియోజకవర్గం లోని మండల/ డివిజన్ అధ్యక్షులు,ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
ఘనంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు
RELATED ARTICLES