భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల పరిధిలోగల మద్దుకూరు గ్రామంలో అధికారులు గ్రామసభ లో తెలంగాణ ప్రభుత్వం జనవరి 26వ తారీకున ప్రభుత్వ పథకాలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించగా గ్రామసభలో పేదవారికి అన్యాయం జరిగిందని చిన్న ఘర్షణ జరిగినది. సభకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరై ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అర్హత ఉన్న అందరూ పథకాలు పొందుతారని కొంతమంది పేర్ల అర్హత ఉన్న లిస్టులో పేర్లు రానివారు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ పథకాలు నిరంతర ప్రక్రియని ప్రతి గ్రామ సభలో దరఖాస్తు నమోదు చేసుకోవాలని తెలియజేశారు. కొందరు ప్రజలు ఆత్మీయ భరోసా పథకంలో మాకు అన్యాయం జరిగిందని అధికారులను నిలదీశారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేకుండా భూమి లేని నిరుపేదలకు రైతు ఆత్మీయ భరోసా అందించాలని మనవి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అశోక్ కుమార్, తహసిల్దార్ సంధ్యారాణి, Ri అక్బర్, ఏ ఈ ఓ శ్రీనివాసరావు, సి పి కృష్ణకుమారి, ఈసీ నరేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ సభలో అధికారులను నిలదీసిన మద్దుకూరు గ్రామస్తులు
RELATED ARTICLES