శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలంలో మండల వ్యవసాయ అధికారి వీరనరేష్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుడిబండ మరియు దేవరహట్టి పంచాయితీ పరిధిలో రైతు సేవ కేంద్రాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మరియు అనుబంధ శాఖల యందు అందిస్తున్న సంక్షేమ పథకాలను రైతులకు వివరించారు .అనంతరం కంది పంట పొలాలను సందర్శించి వాటిలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు సస్యరక్షణ చర్యలు వివరించారు.
ఈ కార్యక్రమానికి రెండు గ్రామాల ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ అధికారి వీర నరేష్, సెరికల్చర్ అధికారి సరోజిని, రైతు సేవ కేంద్రం అధికారులు రాధిక, రమేష్, ప్రకృతి వ్యవసాయం సిబ్బంది గ్రామ రైతులు పాల్గొన్నారు.
గుడిబండ మరియు దేవరహట్టి పంచాయితీ పరిధిలో పొలం పిలుస్తోంది కార్యక్రమం
RELATED ARTICLES