TEJA NEWS TV : కర్నూలు జిల్లా కోసి మండలం సిద్ధరూడమఠంలో జరిగిన వైసీపీ మండల సీనియర్ నాయకులు మాణిక్ రాజ్ కుమార్తె వివాహానికి పార్టీలకు అతీతంగా నేతలు కార్యకర్తలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముందుగా తెలుగుదేశం మంత్రాలయం నియోజకవర్గం ఇంచార్జ్ తిక్క రెడ్డి తన అనుచర వర్గంతో వివాహమంటపానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించగా తరువాత తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు ముత్తు రెడ్డి తన అనుచరులతో విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు చివరగా వైసిపి పార్టీ నాయకులు మండల ఇంచార్జ్ మురళీమోహన్ రెడ్డితో కలిసి పెళ్లి మండపానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు కాగా విచ్చేసిన అతిధులకు వైసీపీ సీనియర్ నేత మాణిక్ రాజు శాలువా పూలమాలతో సత్కరించి గౌరవించారు. కాగా మాణిక్ రాజ్ మండలంలోని వైసిపి కీలక నేత కావడం మాణిక్ రాజ్ కుమార్తె మేజర్ కోసిగి పంచాయతీ సర్పంచ్ కావడంతో మండలంలో రాజకీయంగా గుసగుసలు మొదలయ్యాయి.
కోసిగి: నూతన వధూవరులను ఆశీర్వదించిన ఇరు పార్టీల నేతలు
RELATED ARTICLES