
కోవూరు ఫిబ్రవరి 05:(తేజ న్యూస్ టీవీ )
విద్యార్థులకు నైతిక విలువలు బోధించండి. పడుగుపాడు డిగ్రీ కళాశాలకు మౌళిక వసతులు కల్పిస్తాను. – మరోసారి చెబుతున్నా నేను నాయకురాలిని కాను సేవకురాలినిఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సారధ్యంలో టిడిపి కూటమి అధికారంలోనికి వచ్చాక రాష్టంలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధికినోచుకుంటున్నాయన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . కోవూరు మండలం పడుగుపాడు గ్రామ డిగ్రీ కళాశాలలో 5 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కోవూరు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ YKR & R కళాశాల ఇంగ్లీష్ లెక్చరర్ హరిప్రసాద్ రచించి గాయకులు శ్యామల రావు ఆలపించిన పాటకు విద్ద్యార్థులు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ప్రజలు తన పట్ల చూపుతున్న అభిమానం చూస్తుంటే ప్రజా సమస్యలు పరిష్కార దిశగా మరింత ఉత్సాహంగా పని చేయాలనిపిస్తుందన్నారు. YKR & R కళాశాలలో అదనపు తరగతి గదులు, ఆడిటోరియం నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. విద్యా రంగానికి చేయూతనిచ్చే ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో YKR & R కళాశాల అభివృద్ధి చేస్తానన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు పెంచే విద్యాబోధన చేయాలని అధ్యాపకులను కోరారు. YKR & R కళాశాల విద్యార్థులు భవిషత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆశీర్వదించారు. తాను సేవకురాలినే కానీ ప్రజలపై పెత్తనం చేస్తున్న నాయకురాలు కానన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని ప్రశంసిస్తూ గేయాన్ని రచించిన హరిప్రసాద్, గాయకులు శ్యామల రావులను ఆమె సన్మానించారు.గేయ రచయిత హరిప్రసాద్ పాట ద్వారా తన బాధ్యత గుర్తు చేశారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మి ప్రసూన, ఎంపిడిఓ శ్రీహరిరెడ్డి, తహసీల్దారు నిర్మలానంద బాబా, పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, టిడిపి జిల్లా కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి, ఎంపిపి తుమ్మల పార్వతి, జెడ్పిటిసి శ్రీలత, టిడిపి నాయకులు అత్తిపల్లి శివారెడ్డి, జెట్టి మదన్ రెడ్డి, బాలరవి,జమీర్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.