TEJA NEWS TV
హొళగుంద మండల కేంద్రంలోని
కొండ గుహల్లో వెలిసిన శ్రీ సిద్దేశ్వర స్వామి సన్నిధిలో వారం రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో భాగంగా వసంతోత్సవం కార్యక్రమముతో ఆదివారానికి ఉత్సవాలు ముగిశాయి. సిద్ధమ్మ, సిద్ధప్ప స్వామివార్ల ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుంచి వసంతా మంటపానికి ఊరేగింపుగా వచ్చారు. అక్కడ ఉత్సవమూర్తులను కొలువుంచి కళాశాలతో అనంతరం పంచామృతాలతో అభిషేకించి, పట్టు పితాంబ్రాలతో అలంకరించారు. పల్లకిలో అధిరోహించి మాడ వీధుల్లో ఊరేగుతూ స్వామివారు భక్తులను ఆశీర్వదించారు. అనంతరం పూర్ణాహుతితో ఉత్సవాలను ముగించి అవబృత స్నానం ఆచరించినట్లు
ఆలయ వంశపారంపర్యధర్మకర్తలు రాజా
పంపాన్న గౌడ్,శివ శంకర్ గౌడ్, సిద్ధార్థ్ గౌడ్.హరీష్ గౌడ్ తెలిపారు.
కొండ గుహల్లో వెలిసిన ముగిసిన శ్రీ సిద్దేశ్వర స్వామి వసంతోత్సవం
RELATED ARTICLES