కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను యువత ప్రజల్లోకి తీసుకెళ్లాలని కామారెడ్డి జిల్లా బీజేవైఎం అధికార ప్రతినిధి నర్మల రాజు అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 18 సంవత్సరాల నిండిన యువతకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను బీజేవైఎం కార్యకర్తలు వివరించాలన్నారు మోడీ పాలనను గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన ప్రపంచ దేశాలు స్వాగతిస్తున్నాయని మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండాలని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో జహీరాబాద్ పార్లమెంటుతో పాటు మిగిలిన 16 స్థానాలు గెలుపొందడం లక్ష్యంగా పనిచేయాలని కోరారు
కేంద్ర కేంద్ర ప్రభుత్వ పథకాలను యువత ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి -బీజేవైఎం కామారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి నర్మల రాజు
RELATED ARTICLES