మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది : జగనన్న ప్రభుత్వంలో మహిళలకు సముచిత స్థానం మహిళా ఆర్థికాస్వాలంబనకు జగనన్న కృషి
కంచికచర్ల మండలంలోని కీసర గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా 10 మంది ఎస్టీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లను శాసనసభ్యులు అందజేశారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని.. మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందితే ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందని.. అందుకే జగనన్న ప్రతి పథకం ద్వారా ఆర్థిక లబ్ధిని మహిళల ఖాతాల్లోనే జమ చేస్తున్నారని చెప్పారు. మహిళలకు పలు పథకాల ద్వారా చేయూత అందజేయడంతో పాటు వారికి స్వయం ఉపాధి కోసం ప్రత్యేక శిక్షణ అందజేసి ఉచితంగా కుట్టు మిషన్లను కూడా జగనన్న ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. కీసర గ్రామంలో నిరుపేద ఎస్టీ మహిళలను ఎంపిక చేసి కుట్టు మిషన్ శిక్షణ ఇప్పించి స్వశక్తితో బతికే అవకాశం కల్పించడం స్ఫూర్తిదాయక విషయమని కొనియాడారు. మహిళలు వీటిని ఇంటి అవసరాలకే కాకుండా వ్యాపారం వాణిజ్య దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను, కార్యక్రమాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ..
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ..
కీసర గ్రామంలో ఎస్టీ మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు
RELATED ARTICLES