తేజ న్యూస్ టివి ప్రతినిధి
హనుమకొండ జిల్లా.
భూమికోసం, భుక్తి కోసం, విముక్తి పోరాటం చేసి ఆపరేషన్ కగార్ దొంగ దాడికి అసవులు బాసిన దంతేవాడ అమరవీరుడు ఓరుగల్లు పోరు బిడ్డ సిపిఐ మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యులు, కామ్రేడ్, మాచర్ల ఏసోబు పార్థివ దేహాన్ని డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ విప్లవ జోహార్లతో ఘన నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ కామ్రేడ్ మాచర్ల ఏసొబు విప్లవ భావాలతో మొదలైన తన జీవితం ప్రజల కోసం ఎంతో సేవ చేసిన వ్యక్తి తన ముందు జరుగుతున్న అన్యాయలు అక్రమాలను చూసి చెల్లించి కామ్రేడ్ గా మారిన వ్యక్తి ఏసోబు ఇలాంటి వ్యక్తి మనకు దూరం అవడం చాలా బాధాకరం, మీ లాంటి విప్లవ బావాలు గల వ్యక్తులను రాష్ట్రము లో తయారుచేసి మీ ఆశయాలు నెరవేరుస్తాము అని రామకృష్ణ అన్నారు. అదేవిధంగా నీ కష్టం వృధా కాదు అని నీ ఆలోచనలు మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ప్రజలకి మంచి జరుగుతుంది అని నీ ఆత్మ ఎక్కడ ఉన్నా కూడా శాంతించాలని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ఏసోబు కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చడం జరిగింది.
కామ్రేడ్ ఏసోబుకు ఘనంగా నివాళులర్పించిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
RELATED ARTICLES