కాంగ్రెస్,బిజెపి రెండు పార్టీలు ఒకటేనని,ఆ పార్టీలకు ఓటువేస్తే ఆగమేనని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
మంగళవారం సంగెం మండలం ఎల్గురు రంగంపేట, ఏల్గురు స్టేషన్, నర్సానగర్,బిక్కోజినాయక్ తండ,తిమ్మాపూర్,గాంధీనగర్,కొత్తగూడెం,తీగరాజుపల్లి,సోమ్లతండ,గవిచర్ల, షాపూర్,లోహిత, పెద్దతండ,రామచంద్రాపురం,ఆశాలపల్లి,కాపులకనపర్తి,గుంటూరుపల్లి గ్రామాలలో కార్యకర్తల తో సమావేశంనిర్వహించారు.
ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.
దేవుళ్ళ మీద ప్రమాణాలు చేస్తూ మరో సారి ప్రజలను మోసం చేయడానికి సిఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు.
డిసెంబర్ చివరి వారంలో ఇవ్వాల్సిన రైతుబంధు నిధులే ఇప్పటికీ ఇవ్వలేదు,15 వేల రూపాయల కౌలు రైతులకు ఇస్తానని ఇవ్వలేదు,12000 రైతు కూలీలకు ఇస్తానని ఇవ్వలేదు,4వేల పెన్షన్ అమలు లేదు,వడ్లకు 500 బొనస్ లేదు,మహిళలకు నెల నెలా ఇస్తానన్న 2500 ఆర్థికసహాయం లేదు, 500 గ్యాస్ సిలెండర్ సబ్సిడీ పూర్తిగాఅమలు చేయలేదు,విద్యార్థులకు 5లక్షల భరోసా కార్డులు ఇవ్వలేదు,5లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు,ఉచిత 200 యూనిట్ల విద్యుత్ పథకం సగం మందికి అమలు కాలేదు ఇలా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని కాంగ్రెస్ మళ్ళీ నమ్మి ప్రజలు మోసపోవద్దని అన్నారు.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని తెలిపారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త మండలాలు, నియోజకవర్గాలు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకొని ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.
అలాగే ఎన్నికల సమయంలో ప్రజలను ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.
ఇది ఇలా ఉంటే నష్టపోయిన రైతులను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కసారి అయిన కలసి వారికీ మద్దతుతెలిపారా..ఎండిపోయిన పంటలను పరిశీలించారాఅనిప్రశ్నించారు
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని వర్గాలకు అభివృద్ధి చేసారని అన్నారు.
కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించుకోవాలని ప్రజలకు చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మ గడ్డ వెంకన్న సంగెం వైస్ ఎంపిపి బుక్కా మల్లయ్య, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పసునూరి సారంగపాణి, మండల యూత్ అధ్యక్షులు, పురుషోత్తం రెడ్డి, మరియు బిఆర్ఎస్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసి లు వార్డు సభ్యులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచింది.. -పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
RELATED ARTICLES