TEJA NEWS TV :
-ఎం డి ఎం ,ఆపరేటర్లు డోర్ డెలివరీ ఇవ్వలేదని తనిఖీకల్లో స్పష్టం.
-ఇతరులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోం.
-లబ్ధిదారులు అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
-సెలవు దినాల్లో, రాత్రి వేళలో తాసిల్దార్ కార్యాలయం తలుపులు తెరవ వద్దు.
కుందుర్పి, తేజ న్యూస్:
ప్రభుత్వ చౌక ధాన్య డిపోలలో డీలర్ల అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించే ప్రసక్తి లేదని స్థానిక డిప్యూటీ తాసిల్దార్ తిప్పేస్వామి హెచ్చరించారు. గురువారం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో మండల ఆర్టిఏ నాయకులు కలిసి నిత్యవసర సరుకులు పంపిణీ పై పలు సమస్యల పైన చర్చించారు. ఈ సందర్భంగా డిటి మాట్లాడారు. ఎండిఎం ఆపరేటర్లు ప్రజల ముంగిటకే నిత్యాసర సరుకులు డోర్ డెలివరీ ఇవ్వడం లేదని రెవెన్యూ అధికారుల తనిఖీల్లో తేలిందని స్పష్టం చేశారు. ఎండిఎం ఆపరేటర్లు వాహనం ద్వారా ఇంటి వద్దకు డోర్ డెలివరీ లబ్ధిదారులకు చేయకపోయిన తమకు లబ్ధిదారులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. వినియోగ లబ్ధిదారులు డీలర్లు తుకాలు తక్కువ వేయడంలో కానీ, అధికంగా అక్రమంగా డబ్బు వసూలు చేసినట్లయితే, బిల్లుల ఇవ్వకపోయినా, లబ్ధిదారులు నేరుగా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఘాటుగా హెచ్చరించారు. ఇతరుల ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోమని తెలిపారు. మలై నూరులో కిరాణా దుకాణంలో డీలర్ షాప్ కొనసాగించడం తగదని, ఇకపైన కొనసాగిస్తే చర్యలు తప్పవని డీలర్కు హెచ్చరించమన్నారు. ఆర్,టిఐ నాయకులు మాట్లాడుతూ తొలత రెవెన్యూ అధికారులు లబ్ధిదారులకు సరుకులు ఇచ్చాక రసీదు బిల్లులు అందేలా మీరు బాధ్యతగా జవాబుదారితనంగా చర్యలు తీసుకోవాలని డీటీకి వారు సూచించారు. స్థానిక తాసిల్దార్ కార్యాలయం సెలవు దినం ఆదివారాల్లో రాత్రి సమయంలో పలువురు రైతులతో క్రింది స్థాయి అధికారి తలపులు తెరుస్తున్నారని తెలిపారు. తద్వారా సెలవు దినాల్లో కార్యాలయంలో రాత్రివేళ తలుపులు తీయడం వెనక అంతర్యం ఏమిటి అని డిప్యూటీ తాసిల్దార్ నాయకులు సూటిగా ప్రశ్నించారు. ఇకమీదట కార్యాలయం తలుపులు సెలవు దినాల్లో రాత్రి వేళలో తెరవకుండా చర్యలు తీసుకుంటామని డిటి ఆర్,టి,ఐ, నాయకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఐ నాయకులు, బి ,గోపాల్ ఎం,జి ,శ్రీనివాసులు, ఆర్టిఐ నియోజకవర్గ టాస్క్ఫోర్స్ సభ్యులు, బి, రంగస్వామి, బి, కోదండరాములు, కె ,ఈరన్న తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం: సరుకులు పంపిణీలో డీలర్ల… అవకతవకలకు పాల్పడితే చర్యలు
RELATED ARTICLES