![](https://tejanewstv.com/wp-content/uploads/2024/01/img_20240106_085635_7778016652220447488852-1024x768.jpg)
*సంక్షేమ పథకాలే వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తాయి..* ..
👉 *మరింత అభివృద్ధి జరగాలంటే వైసీపీ ప్రభుత్వం రావాలి.* ..
👉 *కళ్యాణదుర్గం సమన్వయ కర్త, ఎంపీ తలారి రంగయ్య* ..
కళ్యాణదుర్గం : శెట్టూరు తేజ టీవీ న్యూస్
పేదలకు మంచి చేయాలన్న ఆలోచనతో సీఎం వై.యస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారని అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డా.తలారి రంగయ్య పేర్కొన్నారు
శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం నందు పింఛన్ పెంపు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య హాజరై అనంతరం ఆయన మాట్లాడుతూ
సంక్షేమం, అభివృద్ధి జగనన్నతోనే సాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు చేస్తుంటే ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు నిత్యం కుట్రలు చేస్తున్నాయని.. వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 76 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చిన ఘనత సీఎం వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దక్కుతుందని చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని రూ.3 వేలకు పెంచినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపీడీవో రఘురామారావు జెడ్పిటిసి మంజునాథ్ మార్కెట్ యార్డ్ చైర్మన్ తిమ్మరాజమ్మ ఎంపీపీ లక్ష్మీదేవి , రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, నారాయణపురం వెంకటేశులు బోయ తిప్పేస్వామి ఎమ్మెస్ రాయుడు, వైస్ ఎంపీపీ కృష్ణప్ప మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల గ్రామ సచివాల సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు వెల్ఫేర్ అసిస్టెంట్లు సర్పంచులు, ఎంపీటీసీ లు,వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు,పార్టీ ముఖ్య నేతలు,నాయకులు కార్యకర్తలు, పింఛన్ లబ్దిదారులు, పాల్గొన్నారు.