Friday, February 14, 2025

కళ్యాణదుర్గం: శెట్టూరు మండలం యాటకల్లు గ్రామంలో విషాదం

ఒకే కుటుంబంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉరివేసుకొని ఆత్మహత్య.

శోకసముద్రంలో కుటుంబ సభ్యులు.

యాంకర్ వాయిస్

– అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం  శెట్టూరు మండలం యాటకల్లు గ్రామంలో చాకలి జ్యోతి, చాకలి రూప, ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.  గమనించిన స్థానికులు తలుపులు బద్దలు కొట్టి , స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కూతుర్ల మరణ వార్త విన్న కుటుంబసభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వాయిస్ ఓవర్ – గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు ..
చాకలి నారాయణస్వామి, సరస్వతులకు రూపా , జ్యోతి ఇద్దరు కూతుర్లు, వీరిద్దరూ అనంతపురంలో శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. గత నాలుగు రోజుల క్రితం స్వగ్రానికి వచ్చారు, ఈ రోజు ఇంట్లో ఎవరూ లేనిసమయంలో  అక్కాచెల్లెళ్లు ఇద్దరు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని, పోరుగురికి వెళ్లిన తల్లితండ్రులు ఇంటికి ఫోన్ చేసిన ఎంతసేపటికీ ఫోన్ తీయకపోవడంతో , అనుమానంతో పక్కింటి వారికి సమాచారం అందించడంతో ఇరుగు పొరుగువారు ఇంట్లో వాకిలి తీయగా అప్పటికే అక్కచెల్లెలు విగతజీవులుగా ఉన్నారన్నారు, స్థానికులు వెంటనే పోలీసులకు
పోలీసులకు సమాచారం అందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular