TEJA NEWS TV
-మహిళా కష్టాలు తీర్చేందుకే బాబు మహాశక్తి పథకం ప్రారంభం.
-టిడిపి మాజీ శాసనసభ్యులు ,ఉన్నం, హనుమంతరాయ చౌదరి.
ఇంటింటికి వెళ్లి చీరలు గాజులు పంపిణీ చేసిన
-వున్నం వరలక్ష్మి మారుతి చౌదరి.
కంబదూరు
మండల పరిధిలోని ఓబుగానిపల్లి* గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ* పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే భాగంగా మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి గారు, కోడలు ఉన్నం వరలక్ష్మి,* టీడీపీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. అనంతరం ఉన్నం వరలక్ష్మి ప్రతి ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను వివరించారు.
అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలకు మెండుగా నిధులు మంజూరు చేసి గ్రామాలలో అభివృద్ధి చేయడం జరిగింది. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సచివాలయాలు అంటూ చెప్పి సర్పంచుల నిధులను ఇవ్వకుండా గ్రామాలను అంధకారంలోకి నెట్టేశారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి* విమర్శించారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం కూడా అభివృద్ధి పథంలో పయనిస్తుందని, అందుకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామాల అభివృద్ధికి పెద్ద పీట వేశారని రాబోయే రోజుల్లో కూడా మరింత అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని అందుకు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటేయ్యాలని ఉన్నం వరలక్ష్మి* పేర్కొన్నారు……
ఈ కార్యక్రమంలో మాజీ మండల కన్వీనర్ దండా వెంకటేశులు, మాజీ సర్పంచ్ గాజుల శ్రీరాములు, రాష్ట్ర మాజీ లీడ్ క్యాబ్ డైరెక్టర్ ఆవుల తిప్పేస్వామి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పాపంపల్లి రామాంజనేయులు, గౌని శ్రీనివాసులు, సుబ్బారాయుడు, మాజీ ఎంపీటీసీ రాము, హనుమంతరాయుడు, నారాయణమ్మ, సన్నప్పయ్య, కరియన్న, కళ్యాణదుర్గం మండల పార్టీ అధ్యక్షులు గోళ్ల వెంకటేశులు శామీర్, భారీ ఎత్తున మహిళలు వందలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు……
కళ్యాణదుర్గం: బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ టీడీపీ నాయకులు విస్తృత ప్రచారం
RELATED ARTICLES