
చెక్ పోస్ట్ లును యథా ప్రకారం పునరుద్దిస్తాం..
-చెక్ పోస్ట్ లను పరిశీలించిన సిఐ.
– కళ్యాణదుర్గం రూరల్, సీఐ ఎన్, నాగరాజ్.
కళ్యాణదుర్గం,కుందుర్పి, ( తేజ టీవీ న్యూస్):
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా, ఈసీ ఆదేశాల మేరకు మండల పరిధిలోని బెస్తరపల్లి గ్రామ క్రాస్ వద్ద, కుందుర్పి గ్రామ చివరన ఎన్,వెంకటంపల్లి గ్రామ క్రాస్ వద్ద, సీగలపల్లి గ్రామం వద్ద వున్న మూడు చెక్కు పోస్టులను యథావిధిగా పునరుద్దిస్తామని కళ్యాణదుర్గం రూరల్ సీఐ ,ఎన్, నాగరాజు పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కుందుర్పి పోలీస్ స్టేషన్ సందర్శించారు. అనంతరం కుందుర్పి, బెస్తరపల్లి ,శీగలపల్లి గ్రామాల చెక్పోస్టులను సీఐ పోలీస్ సిబ్బందితో కలసి సందర్శించి మూడు గ్రామాలను చెక్పోస్టులు నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రానున్న ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాలు , జిల్లా ఎస్పీ, కేకే అనుపరాజన్ ఆదేశాలు మేరకు కర్ణాటక ఆక్రమ మద్యం, గంజాయి, అక్రమ డబ్బు నగదు, ఇసుక అక్రమ రవాణా, తదితర వాటిని తరలిపోకుండా అడ్డుకట్ట వేయడానికి చెక్ పోస్ట్ లను నియమోస్తున్నట్టు విలేకరులకు ఆయన తెలిపారు. ఒక్కొక్క చెక్ పోస్ట్ కు ముగ్గురు సిబ్బందిని నియమిస్తున్నామని అందులో భాగంగా ఒక ఏఆర్ కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్ వీరు ముగ్గురు కలయికతో విధి నిర్వహణ కొనసాగిస్తారన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ రవాణా కొనసాగుతున్న అసాంఘిక కార్యకలాపాల పైన ప్రత్యేక నిఘవుంచి వీటిని నియంత్రించడమే వీరి జవాబు దారి తనం ,బాధ్యత అన్నారు. సెట్టూరు మండలంలో రెండు చెక్పోస్ట్లను నియమించామని, ఒకటే డీసెంట్ డబా వద్ద, మరొకటి అయ్యర్లపల్లి చెక్పోస్ట్ కలదన్నారు. కంబదూరు మండలంలో ఓబుగానపల్లిలో ఒకటి ,మరొకటి కమ్మదూరు మెయిన్ రోడ్ లో చెక్పోస్ట్ లు ఏర్పాటు చేస్తామన్నారు. బ్రహ్మసముద్రంలో అజయ్ దొడ్డిలో ఒకటి, గుడిపల్లి, రెండు చర్ల గ్రామంలో మొత్తం మూడు చెక్పోస్టులను ఏర్పాటు చేస్తామని వివరించారు. కళ్యాణ్ దుర్గం నుండి కుందుర్పి మీదుగా పోలీస్ స్టేషన్ ఎదటనే అదుల సంఖ్యలో పగలే ఇసుక టిప్పర్ల అక్రమ రవాణా బెంగళూరు కర్ణాటక కు కొనసాగుతుందని సీఐ కి విలేకరులు తెలిపారు. ఈ క్రమంలోనే ఇసుకను తరలించే టిప్పర్లు జెకె కంపెనీవా లేదాఇతరులువా పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ అక్కులన్న, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.